Breaking News

నేడు (మే 2) సన్‌రైజర్స్‌తో తలపడనున్న గుజరాత్‌.. గిల్‌ గాయంపై అప్‌డేట్‌

Published on Fri, 05/02/2025 - 10:49

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (మే 2) గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ సన్‌రైజర్స్‌కు అత్యంత​ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతైరనట్లే. ఈ సీజన్‌లో ఇప్పటికే సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.

సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌ విషయానికొస్తే.. 9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంది. ప్రస్తుత​ పాయింట్ల పట్టికలో ముంబై, ఆర్సీబీ, పంజాబ్‌ టాప్‌-3లో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, కేకేఆర్‌ ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి.

గిల్‌ గాయంపై అప్‌డేట్‌
గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గిల్‌ ఆ మ్యాచ్‌లో వెన్ను సమస్య కారణంగా ఫీల్డింగ్‌కు (బ్యాటింగ్‌ చేశాడు) దిగలేదు. అతడి గైర్హాజరీలో రషీద్‌ ఖాన్‌ గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గిల్‌ గాయంపై గుజరాత్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ విక్రమ్‌ సోలంకి తాజాగా అప్‌డేట్‌ ఇచ్చాడు. గిల్‌ ఇవాళ సన్‌రైజర్స్‌తో జరుగబోయే ​మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.

గిల్‌ గాయంపై సానుకూల అప్‌డేట్‌ రావడంతో గుజరాత్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగ్‌ కీలక దశలో గిల్‌ అందుబాటులో ఉండకపోతే అది గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో గిల్‌ వ్యక్తిగతంగా అద్భుతమై ఫామ్‌లో కొనసాగుతూ (9 మ్యాచ్‌ల్లో 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 389 పరుగులు చేసి ఈ సీజన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితలో ఏడో స్థానంలో ఉన్నాడు), తన జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. 

రాజస్థాన్‌ మ్యాచ్‌లో గిల్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో రషీద్‌ అనుభవారాహిత్యం కారణంగా గుజరాత్‌ ఓటమిపాలైంది. రషీద్‌ కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో పాటు బౌలర్లను సరిగ్గా మేనేజ్‌ చేయలేకపోయాడు.

నేటి మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులోకి రావడం గుజరాత్‌లో జోష్‌ నింపనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకడంతో పాటు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ నేటి మ్యాచ్‌తో కలుపుకుని మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న ముంబై ఇండియన్స్‌తో, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 14న లక్నోతో, మే 18న సీఎస్‌కేతో తలపడనుంది.

నేటి మ్యాచ్‌కు తుది జట్లు (అంచనా)

గుజరాత్‌: శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

సన్‌రైజర్స్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)