IPL 2025: ధోనికి ఇలా జరగడం ఇదే తొలిసారి..!

Published on Thu, 05/01/2025 - 16:38

ఐపీఎల్‌ 2025 ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారికంగా నిష్క్రమించింది. నిన్న (ఏప్రిల్‌ 30) పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమితో ఈ సీజన్‌లో ఆ జట్టు ఖేల్‌ ఖతమైంది. ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన సీఎస్‌కే ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఈ జట్టు ఈ సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

సీఎస్‌కేకు ఈ మ్యాచ్‌లు అంత ముఖ్యం కాకపోయినా ఇతర జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను నిర్ణయిస్తుంది. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఆర్సీబీ (మే 3), కేకేఆర్‌ (మే 7), రాజస్థాన్‌ రాయల్స్‌ (మే 12), గుజరాత్‌ టైటాన్స్‌తో (మే 18) తలపడనుంది. పైన ఉన్న జట్లన్నీ ప్లే ఆఫ్స్‌ రేసులో ఉండటంతో సీఎస్‌కే నిర్ణయాత్మక శక్తిగా మారనుంది.

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ ఆరంభంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ గాయపడటంతో ధోని సీఎస్‌కే పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా సీఎస్‌కే తలరాత ఏమీ మారలేదు. వరుస పరాజయాలతో సతమతమైంది. ఫ్యాన్స్‌ సైతం చాలా రోజుల కిందటే సీఎస్‌కేపై ఆశలు వదులుకున్నారు.

ఈ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన తర్వాత ధోని ఓ అపప్రదను మూటగట్టుకున్నాడు. తొలిసారి వరుసగా రెండు ఐపీఎల్‌ ఫైనల్స్‌ మిస్‌ అయ్యాడు (కానున్నాడు). ఐపీఎల్‌ ప్రారంభం నుంచి ఆడుతున్న ధోని ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరుసగా రెండు ఫైనల్స్‌ ఆడకుండా ఉండలేదు. 

ఓ సీజన్‌ మిస్‌ అయినా మరుసటి సీజన్‌లోనే ఫైనల్‌ ఆడాడు. మొత్తంగా ధోని తన ఐపీఎల్‌ కెరీర్‌లో 11 ఫైనల్స్‌ (10 సీఎస్‌కే తరఫున, ఒకటి రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌ తరఫున) ఆడాడు.

ధోని ఆడిన ఐపీఎల్‌ ఫైనల్స్‌..
2008 (రన్నరప్‌)
2010 (ఛాంపియన్‌)
2011 (ఛాంపియన్‌)
2012 (రన్నరప్‌)
2013 (రన్నరప్‌)
2015 (రన్నరప్‌)
2017 (రన్నరప్‌, పూణే తరఫున)
2018 (ఛాంపియన్‌)
2019 (రన్నరప్‌)
2021 (ఛాంపియన్‌)
2023 (ఛాంపియన్‌)

ధోని ఆడని ఐపీఎల్‌ ఫైనల్స్‌
2009
2014
2016
2020
2022
2024
2025

 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)