Breaking News

RCB Vs PBKS: కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన సాల్ట్‌

Published on Tue, 06/03/2025 - 22:39

పంజాబ్‌తో జరుగుతున్న ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్‌ సాల్ట్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. బౌండరీ లైన్‌ వద్ద నమ్మశక్యం కాని రీతిలో ప్రియాంశ్‌ ఆర్య క్యాచ్‌ అందుకున్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌ చివరి బంతికి ఇది జరిగింది. ఈ వికెట్‌ హాజిల్‌వుడ్‌ ఖాతాలో పడింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 200లోపు స్కోర్‌కే పరిమితమైంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్‌ను అర్షదీప్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇతర బౌలర్లలో జేమీసన్‌ 3, ఒమర్‌జాయ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, చహల్‌ తలో వికెట్‌ తీశారు. 

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్‌ కోహ్లినే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో సాల్ట్‌16, లివింగ్‌స్టోన్‌ 25, జితేశ్‌ శర్మ 24, మయాంక్‌ అగర్వాల్‌ 24, రజత్‌ పాటిదార్‌ 26, రొమారియో షెపర్డ్‌ 17, కృనాల్‌ పాండ్యా 4, భువనేశ్వర్‌ కుమార్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు.

అనంతరం 191 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌ 11 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ప్రియాంశ్‌ ఆర్య (24), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26), శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఔట్‌ కాగా.. జోష్‌ ఇంగ్లిస్‌ (31), నేహల్‌ వధేరా (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా, రొమారియో షెపర్డ్‌ తలో వికెట్‌ తీశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)