Breaking News

IPL 2025, Eliminator Match: చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

Published on Fri, 05/30/2025 - 20:46

ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ రెండు భారీ రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (మే 30) జరుగుతున్న కీలక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రోహిత్‌.. ఐపీఎల్‌లో 7000 పరుగులు సహా 300 సిక్సర్లు పూర్తి చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 2 సిక్సర్లు బాదిన రోహిత్‌ ఐపీఎల్‌లో 300 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 పరుగుల వద్ద 7000 పరుగులు పూర్తి చేసిన రోహిత్‌ ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లి తర్వాత ఈ మార్కును తాకిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్‌-5 బ్యాటర్లు..
క్రిస్‌ గేల్‌-357
రోహిత్‌ శర్మ-300
విరాట్‌ కోహ్లి-291
ఎంఎస్‌ ధోని-264
ఏబీ డివిలియర్స్‌-251

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..
విరాట్‌ కోహ్లి-8618
రోహిత్‌ శర్మ-7000 (ఇన్నింగ్స్‌ కొనసాగుతుంది)
శిఖర్‌ ధవన్‌-6769
డేవిడ్‌ వార్నర్‌-6565
సురేశ్‌ రైనా-5528

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ముంబై ఇండియన్స్‌ 13 ఓవర్ల అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టో 22 బంతుల్లో 47 (4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్‌ 20 బంతుల్లో 33 పరుగులు (ఫోర్‌, 3 సిక్సర్లు) చేశారు. ఈ ఇద్దరి వికెట్లు సాయి కిషోర్‌కు దక్కాయి. 

కాగా, ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు ఫైనల్‌కు ముందు మరో మ్యాచ్‌ (క్వాలిఫయర్‌-2లో పంజాబ్‌తో) ఆడాల్సి ఉంటుంది. నిన్న జరిగిన క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై విజయం సాధించి ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)