Breaking News

DC VS KKR: చరిత్ర సృష్టించిన సునీల్‌ నరైన్‌

Published on Wed, 04/30/2025 - 08:34

పొట్టి క్రికెట్‌లో విండీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ మరో భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఓ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డును నరైన్‌ ఇంగ్లండ్‌ బౌలర్‌ సమిత్‌ పటేల్‌తో షేర్‌ చేసుకున్నాడు. సమిత్‌ ఇంగ్లండ్‌ దేశవాలీ క్రికెట్‌లో నాటింగ్హమ్‌షైర్‌ తరఫున 208 వికెట్లు తీయగా.. నరైన్‌ ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున అన్నే వికెట్లు తీశాడు. 

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో నరైన్‌ 3 కీలక వికెట్లు తీసి కేకేఆర్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో నరైన్‌ బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా కూడా రాణించాడు. తొలుత బ్యాటింగ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ (16 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి, ఆతర్వాత ఫీల్డింగ్‌లో ఓ క్యాచ్‌ సహా, ఓ అద్భుతమైన రనౌట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శనకు గానూ నరైన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

టీ20ల్లో ఓ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-5 బౌలర్లు
సునీల్‌ నరైన్‌- 208 (కేకేఆర్‌)
సమిత్‌ పటేల్‌- 208 (నాటింగ్హమ్‌షైర్‌)
క్రిస్‌ వుడ్‌- 199 (హ్యాంప్‌షైర్‌)
లసిత్‌ మలింగ- 195 (ముంబై ఇండియన్స్‌)
డేవిడ్‌ పెయిన్‌- 193 (గ్లోసెస్టర్‌షైర్‌)

కాగా, నిన్న (ఏప్రిల్‌ 29) అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్‌ 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కు సుడిగాలి ప్రారంభం లభించినప్పటికీ ఆతర్వాత చప్పబడి నామమాత్రపు స్కోర్‌తోనే సరిపెట్టుకుంది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో గుర్భాజ్‌ 26, నరైన్‌ 27, రహానే 26, రఘువంశీ 44, వెంకటేశ్‌ అయ్యర్‌ 7, రింకూ సింగ్‌ 36, రసెల్‌ 17, పావెల్‌ 5, అనుకూల్‌ రాయ్‌ 0 పరుగులకు ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్‌ 3, విప్రాజ్‌, అక్షర్‌ తలో 2, చమీరా ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించినప్పటికీ.. నరైన్‌ మ్యాజిక్‌ చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. డుప్లెసిస్‌ (62), అక్షర్‌ పటేల్‌ (43), విప్రాజ్‌ నిగమ్‌ (38) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 

ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో నరైన్‌ అక్షర్‌, స్టబ్స్‌కు ఔట్‌ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే డుప్లెసిస్‌కు కూడా పెవిలియన్‌కు పంపి గెలుపు బాటలో నడుస్తున్న ఢిల్లీని ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడేశాడు. ఈ దశలో వరుణ్‌ చక్రవర్తి కూడా చెలరేగి అశుతోష్‌ శర్మ (7), స్టార్క్‌ను (0) ఔట్‌ చేశాడు. 

ఆఖర్లో విప్రాజ్‌ ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ రసెల్‌ ఓ అద్బుతమైన బంతితో అతన్ని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. కేకేఆర్‌ బౌలర్లలో నరైన్‌ 3, వరుణ్‌ 2, అనుకూల్‌ రాయ్‌, వైభవ్‌ అరోరా, రసెల్‌ తలో వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుని ప్లే ఆఫ్స్‌ అవకాశాలను చేజేతులా సంక్లిష్టం చేసుకుంది. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)