Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ప్లేయర్‌?

Published on Sat, 11/02/2024 - 20:24

ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అక్షర్‌ పటేల్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కుల్దీప్‌ యాదవ్‌లను మాత్రమే ఢిల్లీ రిటైన్‌ చేసుకుంది. అయితే పంత్‌ను వేలంలోకి విడిచిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఇప్పుడు తమ కొత్త కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది. 

ఈ క్రమంలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌పై ఢిల్లీ యాజమాన్యం కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌ ఆఖరిలో జరగనున్న మెగా వేలంలో అయ్యర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని జీఎంఆర్‌( (GMR) గ్రూప్ యోచిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మళ్లీ సొంతగూటికి?
కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయస్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అయ్యర్‌ 2015లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. అప్పటి ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ అతడిని రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది. తన అరంగేట్రం నుంచి ఐపీఎల్‌-2021 వరకు ఢిల్లీ ఆధారిత ఫ్రాంచైజీకే అయ్యర్‌ ప్రాతినిథ్యం వహించాడు. 

అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్‌గా కూడా శ్రేయస్‌ వ్యవహరించాడు. ఐపీఎల్‌-2020లో అయ్యర్‌ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్‌కు చేరింది. ఆ తర్వాత అయ్యర్‌ తరుచూ గాయాల బారిన పడటంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్‌-2022 సీజన్‌ ముందు విడిచిపెట్టింది. 

ఈ క్రమంలో అయ్యర్‌ స్ధానంలోనే తమ రెగ్యూలర్‌ కెప్టెన్‌గా రిషబ్‌ను ఢిల్లీ నియమించింది. ఇప్పుడు మళ్లీ రివర్స్‌గా రిషబ్‌ను విడిచిపెట్టి అయ్యర్‌ను తమ సారథిగా నియమించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఢిల్లీ పర్స్‌లో ప్రస్తుతం రూ.73 కోట్లు ఉన్నాయి. వేలంలో ఈ భారీ మొత్తాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ ఖర్చుచేయనుంది.
చదవండి: IND vs NZ: నా బౌలింగ్‌లోనే సిక్స‌ర్లు కొడ‌తావా? క‌సి తీర్చుకున్న అశ్విన్‌! వీడియో

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)