Breaking News

IPL 2025: క్రికెట్ చ‌రిత్ర‌లోనే అత్యంత చెత్త రికార్డు..

Published on Sat, 05/03/2025 - 23:14

ఐపీఎల్‌-2025లో చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్  బౌల‌ర్ ఖాలీల్ అహ్మ‌ద్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఖాలీల్ అహ్మ‌ద్‌ను ఆర్సీబీ బ్యాట‌ర్లు ఊతికారేశాడు. తొలుత అత‌డిని జాక‌బ్ బెత‌ల్ టార్గెట్ చేయ‌గా.. ఆఖ‌రిలో రొమ‌రియో షెప‌ర్డ్ చుక్క‌లు చూపించాడు. 

19 ఓవ‌ర్ వేసిన ఖాలీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో షెఫర్డ్ 4 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టి 33 ప‌రుగులు పిండుకున్నాడు. ఖాలీల్ ఓవ‌రాల్‌గా 3 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి ఏకంగా 65 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. ఈ క్ర‌మంలో ఖాలీల్ ఓ చెత్త రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు. 

ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో 3 ఓవ‌ర్ల‌లోనే 65 ప‌రుగులిచ్చిన బౌల‌ర్‌గా చెత్త రికార్డు నెల‌కొల్పాడు. అదేవిధంగా ఐపీఎల్‌-2025లో అత్యంత ఖరీదైన ఓవర్ వేసిన బౌలర్ కూడా అహ్మ‌ద్‌నే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకబ్ బెతల్‌(55), రొమారియో షెపర్డ్(53) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. షెపర్డ్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. సీఎస్‌కే బౌలర్లలో పతిరాన మూడు వికెట్లు పడగొట్టగా.. కుర్రాన్‌, నూర్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)