Breaking News

ఇషాన్‌ కాదు!.. అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్‌ కీపర్లు వీరే!

Published on Thu, 11/21/2024 - 16:43

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే నిర్ణయించింది. రెండురోజుల పాటు ఈ వేలం పాట జరుగనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నవంబరు 24, 25 తేదీల్లో ఖరారు చేసింది.

ఇక ఈసారి వేలంలో టీమిండియా స్టార్లు రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ తదితరులు హైలెట్‌గా నిలవనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లు ఎవరు ఎంత ధర పలుకుతారనే అంశం మీద తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయే వికెట్‌ కీపర్లు వీరేనంటూ ఐదుగురి పేర్లు చెప్పాడు. అయితే, ఇందులో మాత్రం ఇషాన్‌ కిషన్‌కు చోటు దక్కలేదు.

కాగా వేలానికి ముందే వికెట్‌ కీపర్లు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. అదేనండీ రిటెన్షన్స్‌లో భాగంగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్లకు ఆయా ఫ్రాంఛైజీలు భారీ మొత్తం ముట్టజెప్పాయి. 

అతడికి ఏకంగా  రూ. 23 కోట్లు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ కోసం రూ. 23 కోట్లు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ నికోలస్‌ పూరన్‌ కోసం రూ. 21 కోట్లు, రాజస్తాన్‌ రాయల్స్‌ సంజూ శాంసన్‌ కోసం రూ. 18 కోట్లు, ధ్రువ్‌ జురెల్‌ కోసం రూ. 14 కోట్లు ఖర్చు చేశాయి.

ఆ ఐదుగురికే అధిక ధర
ఈ నేపథ్యంలో రాబిన్‌ ఊతప్ప స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ఈసారి వికెట్‌ కీపర్ల కోటాలో రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, జోస్‌ బట్లర్‌, క్వింటన్‌ డికాక్‌, ఫిల్‌ సాల్ట్‌ అత్యధిక మొత్తానికి అమ్ముడుపోతారని అంచనా వేశాడు. 

ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌ను సొంతం చేసుకునేందుకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కచ్చితంగా ఇతర ఫ్రాంఛైజీలతో పోటీకి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కూడా కేఎల్‌ వైపు చూసే అవకాశం లేకపోలేదని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

చదవండి: టాలెంటెడ్‌ కిడ్‌.. ఇక్కడ కూడా.. : నితీశ్‌ రెడ్డిపై కమిన్స్‌ కామెంట్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)