IPL 2025: కేకేఆర్‌తో జతకట్టిన అభిషేక్‌ నాయర్‌

Published on Sat, 04/19/2025 - 18:05

టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌తో జతకట్టాడు. నాయర్‌ టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపిక కాకముందు (గత సీజన్‌లో) కేకేఆర్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం​ ఖాయమని తెలిసాక నాయర్‌ మళ్లీ కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్‌ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.

నాయర్‌ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్‌ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్‌ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్‌బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ కాంట్రాక్ట్‌లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

కాగా, గత ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలవడంలో అభిషేక్‌ నాయర్‌ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్‌ పరిస్థితి ఈ సీజన్‌లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్‌ చేరికతో కేకేఆర్‌ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌ టేబుల్‌ టాపర్లుగా కొనసాగుతున్నాయి. 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)