Breaking News

IPL 2024: ఐపీఎల్‌ టైటిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విరాట్‌

Published on Tue, 03/19/2024 - 20:57

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 19) జరిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) అన్‌బాక్స్‌ ఈవెంట్‌లో ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మహిళల ఐపీఎల్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై స్పందిస్తూ.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్‌ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్‌ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్‌ చూస్తున్నామని.. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్‌ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్‌ గెలిచిన ఫీలింగ్‌ కలిగిందని తెలిపాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

16 ఏళ్లలో తాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా టైటిల్‌ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చానని.. అందు కోసం ప్రతిసారి శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది తన కోరిక అని.. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, టైటిల్‌ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటానని తెలిపాడు. 

కాగా, అన్‌బాక్స్‌ ఈవెంట్‌ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్‌ ఛాంపియన్స్‌ ఆర్సీబీకి గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్‌ కోహ్లి కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా విరాట్‌.. సహచరులతో కలిసి చప్పలు కొడుతూ ఛాంపియన్స్‌ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఈ ఈవెంట్‌ సందర్భంగా విరాట్‌ చాలా హుషారుగా కనిపించాడు.

మహిళా క్రికెటర్లతో కలిసి ఫోటోలను పోజులిచ్చాడు. చిన్నస్వామి స్టేడియం​ మొత్తం విరాట్‌ నామస్మరణతో మార్మోగిపోయింది. ఐపీఎల్‌ 2024 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ..  డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. 


 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)