Breaking News

RCB: గెలిచి నెలైంది.. ఆ మాత్రం ఉంటుందిలే.. విరాట్‌పై దారుణమైన ట్రోల్స్‌!

Published on Fri, 04/26/2024 - 15:02

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆర్సీబీ​​కి ఎట్టకేలకు రెండో విజయం లభించింది. నిన్న సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన అనంతరం ఆ జట్టుకు వరుస పరాజయాల నుంచి ఊరట లభించింది. నిన్నటి మ్యాచ్‌లో డుప్లెసిస్‌ సేన సన్‌రైజర్స్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించి, పరాభావాల పరంపరకు పుల్‌స్టాప్‌ పెట్టింది. 

మార్చి 25న పంజాబ్‌పై సీజన్‌ తొలి విజయం సాధించిన ఆర్సీబీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత ఏప్రిల్‌ 25న మరో విజయం నమోదు చేసింది. ఈ మధ్యలో ఆ జట్టు డబుల్‌ హ్యాట్రిక్‌ పరాజయాలు మూటగట్టుకుంది.

 

 

ఈ విజయం అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్‌ కోహ్లి చిన్నపిల్లాడిలా సంబురాలు చేసుకోవడం టాక్‌ ఆఫ్‌ ద సోషల్‌మీడియాగా మారింది. ఏదో టైటిల్‌ గెలిచినట్లు ఆనందపడిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

 

 

మ్యాచ్‌ గెలిచి నెల అవుతుంది కదా.. ఆ మాత్రం ఉంటుందిలే అని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను ఆర్సీబీ వ్యతిరేకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

 

 

నిన్నటి మ్యాచ్‌లో నిదానంగా ఆడినందుకు కూడా విరాట్‌ కోహ్లి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. విరాట్‌ వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఆడతాడన్న విషయం మరోసారి రుజువైందని నెటిజన్లు మండిపడుతున్నారు.

 

 

రజత్‌ పాటిదార్‌ పుణ్యమా అని ఆర్సీబీ గెలిచింది కానీ..  ఫలితం తారుమారు అయ్యుంటే మాత్రం ఆర్సీబీ అభిమానులే కోహ్లిని ఏకిపారేసి ఉండేవారు. నిన్నటి మ్యాచ్‌లో పాటిదార్‌ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తే.. విరాట్‌ 51 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్నాడు. 

హాఫ్‌ సెంచరీకి ముందు విరాట్‌ చాలా బంతులు వేస్ట్‌ చేశాడు. అతనిలో వ్యక్తిగత మైలురాళ్లు అధిగమించాలనే ఉద్దేశం స్పష్టంగా బయటపడింది. ఇదే అభిమానులకు చిర్రెత్తిపోయేలా చేసింది.

జట్టు కోసం ఎలా ఆడాలో రోహిత్‌ను చూసి నేర్చుకో అంటూ అభిమానులు చురకలంటిస్తు​న్నారు. మొత్తాని​కి మాసం తర్వాత లభించిన విజయానికి అతిగా స్పందించడం.. నిదానంగా ఆడటం వంటి కారణాల చేత విరాట్‌ నిన్నటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)