Breaking News

SRH vs LSG: ఉప్పల్‌ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్‌! ఇలా అయితే..

Published on Wed, 05/08/2024 - 13:18

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఉప్పల్‌ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్‌ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్‌ బృందం తప్పక గెలవాలి.

అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్‌- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్‌ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్‌ వస్తుంది.

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్‌లో సన్‌రైజర్స్‌ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌  కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఆ ప్రాంతాల నుంచి స్పెషల్‌ బస్సులు 
ఈసీఐఎల్‌, ఎల్‌బీనగర్‌, కొండాపూర్‌, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్‌,లక్డీకాపూల్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్‌, జూబ్లీ బస్‌స్టేషన్‌, హకీంపేట్‌, మేడ్చల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్‌ఈఎల్‌ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.

మెట్రోలో సైతం
అలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్‌ వరకు మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మధ్య ప్రయాణికుల డిమాండ్‌ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.

చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)