Breaking News

పిచ్చెక్కించిన రియాన్‌ పరాగ్‌.. మరో సుడిగాలి ఇన్నింగ్స్‌

Published on Wed, 04/10/2024 - 21:40

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో రియాన్‌ మూడో హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రియాన్‌ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మెరుపు అర్దశతకం బాదాడు. రియాన్‌​ హాఫ్‌ సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 48 పరుగులు ఎదుర్కొన్న రియాన్‌.. 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. 

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రియాన్‌ చేసిన స్కోర్ల వివరాలు..

  1.   43(29) vs LSG
  2.   84*(45) vs DC
  3.   54*(39) vs MI
  4.    4 (4) vs RCB
  5.   76 (48) vs GT

ఈ సీజన్‌లో రియాన్‌ 5 మ్యాచ్‌ల్లో 158.18 స్ట్రయిక్‌రేట్‌తో 87 సగటున 261 పరుగులు చేసి విరాట్‌ కోహ్లి (316) తర్వాత సీజన్‌ సెకెండ్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. 

రియాన్‌, సంజూ మెరుపులు.. రాజస్థాన్‌ భారీ స్కోర్‌
మ్యాచ్‌ విషయానికొస్తే.. రియాన్‌ పరాగ్‌తో పాటు సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)