Breaking News

కుల్దీప్‌ సేన్‌ విజృంభణ​.. గుజరాత్‌ బ్యాటర్లకు చుక్కలు

Published on Wed, 04/10/2024 - 23:20

ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ చెలరేగిపోయాడు. 10 బంతుల వ్యవధిలో 3 కీలక వికెట్లు తీసి 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న గుజరాత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 9వ ఓవర్‌ రెండో బంతికి సాయి సుదర్శన్‌ను (35) ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపిన సేన్‌.. ఆతర్వాత 11వ ఓవర్‌ తొలి బంతికి, నాలుగో బంతికి మాథ్యూ వేడ్‌ (4), అభినవ్‌ మనోహర్‌ను (1) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

సేన్‌ ధాటికి గుజరాత్‌ 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 83 పరుగులు మాత్రమే చేసింది. సేన్‌ అనంతరం చహల్‌ గుజరాత్‌ బ్యాటర్లను పరేషాన్‌ చేశాడు. చహల్‌ 14వ ఓవర్‌లో విజయ్‌ శంకర్‌ (16), 16వ ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ను (72) చాకచక్యంగా బోల్తా కొట్టించాడు. ముఖ్యంగా చహల్‌ గిల్‌ను ఔట్‌ చేసే విషయంలో చాలా తెలివిగా వ్యవహరించాడు.

గిల్‌ క్రీజ్‌ దాటి వస్తాడని ముందుగానే పసిగట్టిన చహల్‌.. తెలివిగా వైడ్‌ వేయగా..  ఇది తెలియని గిల్‌ ముందుకు వచ్చి ఆడే క్రమంలో స్టంప్‌ ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 138/5గా ఉంది. తెవాతియా, షారుక్‌ ఖాన్‌ క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలవాలంటే 24 బంతుల్లో 59 పరుగులు చేయాల్సి ఉంది.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)