Breaking News

కొంపముంచిన స్లో ఓవర్‌ రేట్‌.. రాజస్థాన్‌పై గుజరాత్‌ సంచలన విజయం

Published on Thu, 04/11/2024 - 00:07

ఐపీఎల్‌ 2024లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 10) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ కొంపముంచింది. రాయల్స్‌ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్‌లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్‌లో సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్‌ ఓటమికి కారణమైంది.

6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్‌ బయట ఓ ఫీల్డర్‌ తక్కువగా ఉండటంతో గుజరాత్‌ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్‌లో గుజరాత్‌ బ్యాటర్లు సర్కిల్‌ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రషీద్‌ ఖాన్‌ ఫోర్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్‌ సేన్‌ 19వ ఓవర్‌లో 20 పరుగులిచ్చి గుజరాత్‌ను గెలుపు లైన్‌లో నిలబెట్టాడు. మ్యాచ్‌ ఆరంభంలో ఇదే కుల్దీప్‌ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్‌ రేటే రాజస్థాన్‌ పాలిట శాపంగా మారింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌.. రియాన్‌ పరాగ్‌ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (38 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్‌ 8, హెట్‌మైర్‌ 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్‌ తెవాతియా (22), రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్‌ (35), శుభ్‌మన్‌ గిల్‌ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్‌ 4, అభినవ్‌ మనోహర్‌ 1, విజయ్‌ శంకర్‌ 16, షారుక్‌ ఖాన్‌ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్‌ సేన్‌ (4-0-41-3), చహల్‌ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)