Breaking News

ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ ఛాన్స్‌ . అలా జరిగితేనే?

Published on Mon, 05/13/2024 - 22:05

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జూలు విదిల్చింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 47 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 

ఈ విజయంతో ఆర్సీబీ తమ రన్‌రేట్‌ను భారీగా మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్ధానానికి చేరుకుంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి.

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే?
ఆర్సీబీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే సీఎస్‌కేతో పాయింట్ల పరంగా సమమవుతోంది.  ఆర్సీబీ విజయంతో పాటు తమ రన్‌రేట్‌ను కూడా మెరుగు పరుచుకోవాలి. 

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి. అదే ఛేజింగ్‌లో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేయాలి. ఈ క్రమంలో సీఎస్‌కే(+0.528) కంటే ఆర్సీబీ  మెరుగైన రన్‌రేట్(+0.387) సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)