Breaking News

IPL 2024: ఫీల్డ్‌ అంపైర్ల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిద్దూ

Published on Thu, 04/25/2024 - 17:58

క్రికెట్‌లో టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫీల్డ్‌ అంపైర్ల పాత్రపై టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెక్నాలజీ ఉపయోగించి 90 శాతం నిర్ణయాలు థర్డ్‌ అంపైర్లు తీసుకుంటుంటే ఫీల్డ్‌ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నాడు. ఫీల్డ్‌ అంపైర్‌ అంటే ప్రతి నిర్ణయాన్ని థర్డ్‌ అంపైర్‌కు వదిలేయడం కాదని తెలిపాడు.

ఫీల్డ్‌ అంపైర్లు విచక్షణ ఉపయోగించి సొంత నిర్ణయాలు తీసుకుంటేనే క్రికెట్‌కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి విషయాన్ని థర్డ్‌ అంపైరే తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్‌ అంపైర్ అవసరమే లేదన్నాడు. ఇటీవల కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి సంఘటనను దృష్టిలో పెట్టుకుని సిద్దూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా బౌలింగ్‌లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఫుల్‌ టాస్‌ బంతికి కోహ్లి ఔటయ్యాడు.

 

 

నో బాల్‌ కోసం కోహ్లి అప్పీల్‌ చేసినప్పటికీ థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. ఫీల్డ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగి ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ఈ వివాదాస్పద ఘటన క్రికెట్‌ వర్గాల్లో పెను దుమారం లేపింది. 

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రస్తుతం రసపట్టులో సాగుతుంది. ఆర్సీబీ, పంజాబ్‌ మినహా అన్ని జట్లు ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచాయి. రాజస్థాన్‌, కేకేఆర్‌, సన్‌రైజర్స్‌ జట్లకు ప్లే ఆఫ్స్‌ బెర్తులు దాదాపుగా ఖరారు కాగా.. మరో బెర్తు కోసం ఐదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌, కేకేఆర్‌, సన్‌రైజర్స్‌, లక్నో, సీఎస్‌కే, గుజరాత్‌, ముంబై, ఢిల్లీ, పంజాబ్‌, ఆర్సీబీ వరుస స్థానాల్లో ఉన్నాయి. అన్ని జట్లు మరో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)