Breaking News

తండ్రిని ఎంకరేజ్‌ చేసేందుకు వచ్చిన జూనియర్‌ బుమ్రా..!

Published on Tue, 05/07/2024 - 10:55

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ మెరుపు శతకంతో (51 బంతుల్లో 102 నాటౌట్‌; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడి ముంబైని ఒంటిచేత్తో గెలిపించాడు. 

తొలుత ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ 173 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఛేదనలో ముంబై సైతం ఆదిలో తడబడినప్పటికీ స్కై.. తిలక్‌ వర్మ (37 నాటౌట్‌) సహకారంతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్‌లో స్కైకు ఇది రెండో సెంచరీ. 

ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు హార్దిక్‌ పాండ్యా (4-0-31-3), పియూశ్‌ చావ్లా (4-0-33-3) సైతం సత్తా చాటారు. నాలుగు వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు ముంబైకు ఊరటనిచ్చే గెలుపు దక్కింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో పదో స్థానం నుంచి తొమ్మిదో ప్లేస్‌కు ఎగబాకింది. 

ఈ సీజన్‌లో ముంబై మరో రెండు మ్యాచ్‌లు (మే 11న కేకేఆర్‌తో, మే 17న లక్నోతో) ఆడాల్సి ఉన్నా ప్లే ఆఫ్స్‌కు చేరే పరిస్థితి లేదు. అలాగని టెక్నికల్‌గా ఇంకా ఔట్‌ కాలేదు. ఏదైనా మహాద్భుతం​ జరిగితే తప్ప ముంబై ఈ సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు.

జూనియర్‌ బుమ్రా వచ్చాడు..
ఇదిలా ఉంటే, నిన్న వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ చిట్టిపొట్టి అతిథి అందరి దృష్టిని ఆకర్శించాడు. అతడే బుమ్రా తనయుడు అంగద్‌ బుమ్రా. అంగద్‌.. తన తల్లి సంజనా గణేశన్‌తో కలిసి తన తండ్రి జస్ప్రీత్‌ బుమ్రాను ఎంకరేజ్‌ చేసేందుకు వాంఖడేకు వచ్చాడు. 

వీఐపీ స్టాండ్స్‌లో సంజనా.. అంగద్‌ను ఒడిలో కూర్చొబెట్టుకుని కెమెరా కంటికి చిక్కింది. ఈ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. అంగద్‌ తొలిసారి పబ్లిక్‌లోకి రావడంతో చిన్నారిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. అంగద్‌ ముంబై ఇండియన్స్‌ జెర్సీ ధరించి ఉండటంతో ఆ ఫ్రాంచైజీ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. 

జూనియర్‌ బుమ్రా వచ్చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లో యధావిధిగా అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు పూర్తి చేసిన బుమ్రా కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన అభిషేక్‌ శర్మ (11) వికెట్‌ పడగొట్టాడు. మొత్తానికి బుమ్రా కొడుకు అంగద్‌ నిన్నటి మ్యాచ్‌ సందర్భంగా చర్చనీయాంశంగా మారాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)