Breaking News

IPL 2024 RCB Vs MI: బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన సిరాజ్‌

Published on Fri, 04/12/2024 - 10:13

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్సీబీని మట్టికరిపించింది.

తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు.

సరదాసరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు తారసపడ్డాయి. అభిమానులు హార్దిక్‌ను గేలి చేస్తుంటే విరాట్‌ అడ్డు చెప్పడం.. దిగ్గజ క్రికెటర్లు విరాట్‌, రోహిత్‌ మధ్య సరదా సంభాషణ.. రోహిత్‌ దినేశ్‌ కార్తీక్‌ను ఆట పట్టించడం (మరో వరల్డ్‌కప్‌ ఆడాలని ఉందా అని).. ఇలా మ్యాచ్‌ మొత్తం సరదాసరదాగా సాగింది. మ్యాచ్‌ పూర్తయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్‌ చేసుకోవడం చూపరులను  ఆకట్టుకుంది.

సిరాజ్‌ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగినందుకు గాను సిరాజ్‌ బుమ్రాకు సలాం కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఫ్యాన్స్‌ ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. హార్దిక్‌ను కోహ్లి వెనకేసుకురావడాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్‌ (61), రజత్‌ పాటిదార్‌ (50), దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు.

అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్‌, రోహిత్‌, స్కై, హార్దిక్‌ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచి అవకాశలున్న మ్యాచ్‌ను ప్రత్యర్దికి పూలల్లో పెట్టి ఇచ్చారు. 
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)