IPL 2024 RCB Vs MI: ముంబై, ఆర్సీబీ మ్యాచ్‌పై అనుమానాలు..?

Published on Fri, 04/12/2024 - 14:36

వాంఖడే వేదికగా ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై పలువురు క్రికెట్‌ అభిమానులు అనుమానం వ్యక్తిం చేస్తున్నారు. టాస్‌ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. మ్యాచ్‌ రిఫరీ జవగల్‌ శ్రీనాథ్‌ టాస్‌ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు.

ఐపీఎల్‌ అంటేనే ఫిక్సింగ్‌ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలవాలని ముందుగానే ఫిక్స్‌ అయ్యిందని అంటున్నారు. శ్రీనాథ్‌ టాస్‌ ఫలితాన్ని మార్చాడనటానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని పోస్ట్‌ (సోషల్‌మీడియాలో) చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. 

కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆర్సీబీని మట్టికరిపించింది.  

తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు.  ఫలితంగా ముంబై ఇండియన్స్‌ సీజన్‌లో రెండో గెలుపును నమోదు చేసింది. ఈ విజయాలకు ముందు ముంబై హ్యాట్రిక్‌ పరాజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఆర్సీబీ 6 మ్యాచ్‌్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఈ సీజన్‌లోనూ ఆర్సీబీ రిక్త హస్తాలతోనే వెనుదిరగాల్సి వస్తుంది. 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)