Breaking News

IPL 2024: చిరకాలం గుర్తుండిపోయే శతకం.. సంబురాలకు దూరంగా ఉన్న రోహిత్‌

Published on Mon, 04/15/2024 - 08:47

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో నిన్న మూడో సెంచరీ నమోదైంది. ఈ ఎడిషన్‌లో విరాట్‌ కోహ్లి, జోస్‌ బట్లర్‌ ఇప్పటివరకు సెంచరీలు చేయగా.. తాజాగా రోహిత్‌ శర్మ వీరి సరసన చేరాడు. సీఎస్‌కేతో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మూడంకెల స్కోర్‌ను చేరుకున్నాడు. రోహిత్‌ బ్యాట్‌ నుంచి చాలాకాలం తర్వాత జాలువారిన శతకం ఇది. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్‌ శర్మకు ఇది చాలా ప్రత్యేకం.

అడపాదడపా ఫామ్‌.. వయసు మీద పడటం.. కెప్టెన్సీ పోవడం వంటి విపత్కర పరిస్థితుల్లో హిట్‌మ్యాన్‌ తన సొంత మైదానంలో సెంచరీ చేసి శభాష్‌ అనిపించుకున్నాడు. రోహిత్‌ సెంచరీతో ముంబై అభిమానులు మురిసిపోయారు. ఈ సెంచరీ రోహిత్‌కు సైతం చిరకాలం గుర్తుండిపోతుంది. రోహిత్‌ బౌండరీ బాది సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే వాంఖడే స్టేడియంలో సంబురాలు అంబరాన్ని అంటాయి.

అభిమానుల కేరింతులు, చప్పట్ల ధ్వనులతో స్టేడియం మార్మోగిపోయింది. ప్రత్యర్ది డగౌట్‌ సహా స్టేడియం మొత్తం హిట్‌మ్యాన్‌కు స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇచ్చింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే హిట్‌మ్యాన్‌ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత సంబురాలకు దూరంగా ఉన్నాడు. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం తన సెంచరీని సెలబ్రేట్‌ చేసుకుంటుంటే హిట్‌మ్యాన్‌ మాత్రం​ తన సహజ శైలి భిన్నంగా సైలెంట్‌గా ఉన్నాడు.

రోహిత్‌ ముఖంలో సాధించానన్న కసి కనిపించినప్పటికీ అది బయట పడకుండా చాలా ఉద్వేగంగా కనిపించాడు. సెంచరీ అనంతరం రోహిత్‌ నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో ఉన్న మొహమ్మద్‌ నబీతో కరచాలనం చేసి నామమాత్రంగా బ్యాట్‌ను పైకి లేపాడు. ఇంతకు మించి రోహిత్‌ ఏ సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు. ముంబై ఓటమి అప్పటికే ఖరారు కావడంతో రోహిత్‌ మిన్నకుండిపోయాడు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో నెట్టింట​ వైరలవుతుంది.

హిట్‌మ్యాన్‌ యాటిట్యూడ్‌ను అంతా ప్రశంశిస్తున్నారు. ఎంత సాధించినా ఒదిగి ఉండటం అంటే ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కొందరు నెటిజన్లు రోహిత్‌ సెంచరీని తప్పుబడుతున్నారు. హిట్‌మ్యాన్‌ సెంచరీ కోసం చాలా స్వార్దంగా బ్యాటింగ్‌ చేశాడని అంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌లో ముంబై ఓడిందని అంటున్నారు. రోహిత్‌ సెంచరీ కోసం కాకుండా తన సహజ శైలిలో బ్యాటింగ్‌ చేసుంటే ముంబై గెలిచుండేదని చర్చించుకుంటున్నారు.

భారీ లక్ష్య ఛేదనలో (207) ఇలాగేనా బ్యాటింగ్‌ చేసేదంటూ రోహిత్‌ వ్యతిరేకులు పేలిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో తాము ఓడినా రోహిత్‌ శర్మ సెంచరీ తృప్తినిచ్చిందని ముంబై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో ముంబై సీఎస్‌కే చేతిలో 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్‌ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని (4 బంతుల్లో 20 నాటటౌ్‌; 3 సిక్సర్లు) హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్ల బాదడంతో సీఎస్‌కే 200 పరుగుల మార్కును దాటింది. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని ఆఖరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయని నెటిజన్లు అనుకుంటున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ ముంబై ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)