Breaking News

IPL 2024 MI VS CSK: చరిత్ర సృష్టించిన ధోని

Published on Mon, 04/15/2024 - 10:23

ఐపీఎల్‌ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 14) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్‌ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని చివరి నాలుగు బంతుల్లో 20 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హార్దిక్‌ పాండ్య వేసిన ఈ ఓవర్‌లో శివాలెత్తిపోయిన ధోని.. హ్యాట్రిక్‌ సిక్సర్లు బాది జట్టు స్కోర్‌ను 200 పరుగులు దాటించాడు. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ (63 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ధోని ఆఖరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే ముంబై, సీఎస్‌కే స్కోర్లకు వ్యత్యాసం కావడం విశేషం. 4 వికెట్లు తీసిన పతిరణ సీఎస్‌కే గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో తన బ్యాట్‌ నుంచి జాలువారిన సుడిగాలి ఇన్నింగ్స్‌ కారణంగా ధోని మరోసారి చరిత్రపుటల్లోకెక్కాడు. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఎదుర్కొన్న తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా సునీల్‌ నరైన్‌, నికోలస్‌ పూరన్‌ తర్వాత మూడో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

ఈ మ్యాచ్‌లో మరో నాలుగు బంతులు మిగిలుండగా బరిలోకి దిగిన ధోని 3, 4, 5 బంతులను సిక్సర్లుగా మలిచి, ఆఖరి బంతికి రెండు పరుగులు తీశాడు. హార్దిక్‌ వేసిన ఈ ఓవర్‌లో సీఎస్‌కే ఏకంగా 26 పరుగులు పిండుకుంది. ఈ ఓవరే ముంబై ఇండియన్స్‌ కొంప ముంచిందని అభిమానులు అనుకుంటున్నారు. ధోని సీఎస్‌కే తరఫున తన 250 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.  


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)