Breaking News

చరిత్ర సృష్టించిన సాల్ట్‌.. గంగూలీ రికార్డు బ్రేక్‌

Published on Tue, 04/30/2024 - 09:26

ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ పరుగుల వరద పారించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

మిగతా బ్యాటర్లు పరుగులు తీసేందుకు ఇబ్బందిపడిన చోట.. సాల్ట్‌ 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో ఏకంగా 68 పరుగులు రాబట్టాడు. తద్వారా ఢిల్లీ విధించిన 154 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని కేకేఆర్‌ 16.3 ఓవర్లలోనే ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక తన అద్భుత ఇన్నింగ్స్‌ ద్వారా ఫిలిప్‌ సాల్ట్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో సౌరవ్‌ గంగూలీ పేరిట ఉన్న రికార్డును సాల్ట్‌ బద్దలు కొట్టాడు.  ఢిల్లీ డైరెక్టర్‌గా ఉన్న గంగూలీ ముందే సాల్ట్‌ ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం. 

ఐపీఎల్‌ సీజన్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లు
1. ఫిలిప్‌ సాల్ట్‌-  ఆరు ఇన్నింగ్స్‌లో 344 రన్స్‌- 2024
2. సౌరవ్‌ గంగూలీ- ఏడు ఇన్నింగ్స్‌లో 331 రన్స్‌- 2010
3. ఆండ్రీ రసెల్‌- ఏడు ఇన్నింగ్స్‌లో 311 రన్స్‌- 2019
4. క్రిస్‌ లిన్‌- తొమ్మిది ఇన్నింగ్స్‌లో 303 రన్స్‌- 2018.

కేకేఆర్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోర్లు
వేదిక: ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా, సోమవారం
టాస్‌: ఢిల్లీ.. బ్యాటింగ్‌

ఢిల్లీ స్కోరు: 153/9 (20)
కేకేఆర్‌ స్కోరు: 157/3 (16.3)

ఫలితం: ఢిల్లీపై ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌ గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: వరుణ్‌ చక్రవర్తి(కేకేఆర్‌)- 4 ఓవర్ల బౌలింగ్‌ కోటాలో కేవలం 16 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.
టాప్‌ స్కోరర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఫిలిప్‌ సాల్ట్‌(68).

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)