Breaking News

ఐపీఎల్‌లో నేడు రెండు బిగ్‌ ఫైట్స్‌

Published on Sun, 04/14/2024 - 11:11

ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 14) రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కేకేఆర్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడనుండగా.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదిక కానుండగా.. రాత్రి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడేలో జరుగనుంది.

మధ్యాహ్నం మ్యాచ్‌ విషయానికొస్తే.. హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న లక్నో.. పటిష్టమైన కేకేఆర్‌ను వారి సొంత మైదానంలో ఢీకొట్టబోతుంది. ప్రస్తుతం లక్నో 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో కేకేఆర్‌ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్‌ విజయాల అనంతరం కేకేఆర్‌ ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొంది. కేకేఆర్‌ తమ చివరి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో పరాజయంపాలైంది. హెడ్‌ టు హెడ్‌ ఫైట్‌ల విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. 

ముంబై, సీఎస్‌కే మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌ను అభిమానులు క్రికెట్‌ ఎల్‌ క్లాసికోగా (సమవుజ్జీల సమరం) పిలుస్తారు. ప్రస్తుత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు వరుస విజయాలతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రెడీ తమ జైత్రయాత్రను స్టార్ట్‌ చేసింది. 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. హెడ్‌ టు హెడ్‌ ఫైట్స్‌ విషయానికొస్తే.. ఇరు జట్లు మధ్య ఇప్పటివరకు  36 మ్యాచ్‌లు జరగగా ముంబై 20, సీఎస్‌కే 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)