Breaking News

IPL 2024: శశాంక్‌ సింగ్‌ గతంలోనూ గుజరాత్‌ బౌలర్లను వదల్లేదు.. చీల్చిచెండాడు..! 

Published on Fri, 04/05/2024 - 15:50

గుజరాత్‌ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 4) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు శశాంక్‌ సింగ్‌  (29 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం క్రికెట్‌ సర్కిల్స్‌లో చర్చ జోరుగా సాగుతుంది. క్రికెట్‌ అభిమానులు శశాంక్‌ గురించి ఆరా తీసే క్రమంలో అతని పాత వీడియో ఒకటి బయటపడింది. ఇందులో శశాంక్‌ విధ్వంసం వీర లెవెల్లో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. 

2022 ఐపీఎల్‌ సీజన్‌కు సంబందించిన ఆ వీడియోలో శశాంక్‌ సన్‌రైజర్స్‌కు ఆడుతూ గుజరాత్‌ బౌలర్లు చీల్చిచెండాడాడు. నిన్నటి మ్యాచ​్‌తో పోలిస్తే ఆ విధ్వంసం వేరే లెవెల్లో ఉంది. శశాంక్‌ ఊచకోతకు గతంలోనూ గుజరాత్‌ బౌలర్లు బలయ్యారు.

నాడు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో శశాంక్‌ ఏడో స్థానంలో బరిలోకి దిగి 6 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ ఇన్నింగ్స్‌లో శశాంక్‌ స్ట్రయిక్‌రేట్‌ 416.67గా ఉంది. అదే సీజన్‌లో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన శశాంక్‌ ఫెర్గూసన్‌ లాంటి బౌలర్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు శశాంక్‌కు గుజరాత్‌ అంటే కసిలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, శాశం​క్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (89 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (35) రెచ్చిపోవడంతో పంజాబ్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో గుజరాత్‌ను వెనుక్కునెట్టి ఐదో స్థానానికి చేరుకుంది.

Videos

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)