Breaking News

IPL 2024 GT VS PBKS: చరిత్ర సృష్టించిన పంజాబ్‌ కింగ్స్‌

Published on Fri, 04/05/2024 - 12:22

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక సార్లు 200 అంతకు పైగా లక్ష్యాలను ఛేదించిన జట్టుగా పంజాబ్‌ కింగ్స్‌ చరిత్ర సృష్టించింది. నిన్న గుజరాత్‌పై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో పంజాబ్‌ కింగ్స్‌ ఈ రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్‌లో పంజాబ్‌ ఇప్పటివరకు ఆరుసార్లు 200 అంతకంటే ఎక్కువ లక్ష్యాలను ఛేదించింది. పంజాబ్‌ తర్వాత ముంబై ఇండియన్స్‌ అత్యధిక సార్లు (5) 200 ఆపైచిలుకు లక్ష్యాలను ఛేదించింది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ మరో బంతి మిగిలుండగానే విజయవంతంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (89 నాటౌట్‌) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాహా (11), విజయ్‌ శంకర్‌ (8) నిరాశపర్చగా.. కేన్‌ విలియమ్సన్‌ (26), సాయి సుదర్శన్‌ (33) పర్వాదేనిపించారు. ఆఖర్లో రాహుల్‌ తెవాటియా (8 బంతుల్లో 23 నాటౌట్‌) గిల్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ 2, హర్ప్రీత్‌ బ్రార్‌, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ 70 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన శాశం​క్‌ సింగ్‌ (29 బంతుల్లో 61 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. శశాంక్‌తో పాటు అశుతోష్‌ శర్మ (17 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్‌) కూడా అద్భుతమై ఇన్నింగ్స్‌ ఆడాడు. అశుతోష్‌.. శశాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు మెరుపు వేగంతో 43 పరుగులు సమకూర్చి పంజాబ్‌కు ఊహించని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన అశుతోష్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి పంజాబ్‌ పాలిట గెలుపు గుర్రంగా మారాడు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో శశాంక్‌, అశుతోష్‌తో పాటు ప్రభ​్‌సిమ్రన్‌ (35), బెయిర్‌స్టో (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ఒమర్‌జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, మోహిత్‌ శర్మ, దర్శన్‌ నల్కండే తలో వికెట్‌ దక్కించుకున్నారు.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)