Breaking News

Play Offs: స్టార్‌ ఓపెనర్‌ దూరం?... కేకేఆర్‌కు ఓ గుడ్‌న్యూస్‌!

Published on Tue, 05/07/2024 - 18:27

ఐపీఎల్‌-2024లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటికే ఆడిన పదకొండు మ్యాచ్‌లలో ఏకంగా ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది శ్రేయస్‌ అయ్యర్‌ సేన.

కేకేఆర్‌ ఓపెనర్లు ఫిలిప్‌ సాల్ట్‌, సునిల్‌ నరైన్‌ ‌విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఆల్‌రౌండర్‌ నరైన్‌ 11 ఇన్నింగ్స్‌లో 461, సాల్ట్ 429 పరుగులు సాధించారు.

అతడు దూరం!
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ స్టార్‌ ఫిలిప్‌ సాల్ట్‌ త్వరలోనే కేకేఆర్‌ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వదేశంలో పాకిస్తాన్‌తో మే 22 నుంచి టీ20 సిరీస్‌ నేపథ్యంలో.. అతడు ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ దశలో కేకేఆర్‌కు దూరమవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ నిజంగా అదే జరిగితే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లే! అయితే, ఇలాంటి సమయంలో అఫ్గనిస్తాన్‌ ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌  బ్యాటర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ శుభవార్తతో ముందుకు వచ్చాడు. త్వరలోనే తాను కేకేఆర్‌తో చేరనున్నట్లు వెల్లడించాడు.

PC: IPL
తల్లి అనారోగ్యం కారణంగానే
కాగా 2023లో కేకేఆర్‌లో అడుగుపెట్టిన గుర్బాజ్‌ 11 మ్యాచ్‌లు ఆడి 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు కూడా ఉండటం విశేషం. ఇక ఈ ఏడాది సాల్ట్‌- నరైన్‌ జోడీ కారణంగా అతడికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఈ క్రమంలో ఇటీవలే గుర్బాజ్‌ స్వదేశానికి తిరిగి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎక్స్‌ వేదికగా క్లారిటీ ఇచ్చాడు రహ్మనుల్లా గుర్బాజ్‌.

త్వరలోనే వస్తాను
‘‘మా అమ్మ అనారోగ్యం దృష్ట్యా ఐపీఎల్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నాను. త్వరలోనే కేకేఆర్‌ కుటుంబాన్ని కలుస్తాను. మా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తనకోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు’’ అని గుర్బాజ్‌ పేర్కొన్నాడు.

చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్‌ శర్మ.. వీడియో వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)