Breaking News

IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌ హోం మ్యాచ్‌లు విశాఖలో.. ఎందుకంటే..?

Published on Thu, 02/22/2024 - 18:37

ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ తొలి విడత షెడ్యూల్‌ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహకులు 17 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. ఈ లెగ్‌లో మొత్తం 21 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 22న ఓపెనింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇంతవరకు టైటిల్‌ గెలవని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనుంది. తొలి విడతలో డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. డే గేమ్స్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు.. నైట్‌ మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

కాగా, తొలి విడత షెడ్యూల్‌లో ఓ ఆసక్తికర విషయం అందరి దృష్టిని ఆకర్శించింది. అన్ని జట్లు తమ హోం గేమ్స్‌ను సొంత మైదానాల్లో ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ మాత్రమే సొంత మైదానంలో కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆడుతుంది. 

ఇందుకు కారణంగా ఏంటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు సొంత మైదానమైన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో పురుషుల ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్‌ జరుగనుంది. ఈ మైదానంలో మహిళల ఐపీఎల్‌ సెకెండ్‌ ఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లెక్కన పురుషుల ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ఇక్కడ 11 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

వరుస మ్యాచ్‌ల కారణంగా పిచ్‌ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డీసీ యాజమాన్యం, బీసీసీఐ కలిసి సంయుక్తంగా వేదికను విశాఖకు తరలించేందుకు అంగీకరించారు. ప్రస్తుతానికి ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు హోం గేమ్స్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు ఢిల్లీలో కాకుండా విశాఖలో జరుగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌..  మార్చి 31న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో.. ఏప్రిల్‌ 3న కేకేఆర్‌తో విశాఖలో ఆడనుంది. ఇక రెండో విడతలో ఢిల్లీ ఆడాల్సిన ఐదు హోం గేమ్స్‌ను సొంత మైదానంలోనే ఆడుతుంది.

ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. మొహాలీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో డీసీ టీమ్‌.. పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 28న జైపూర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో (రాత్రి 7:30).. మార్చి 31న విశాఖ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో (రాత్రి 7:30).. ఏప్రిల్‌ 3న విశాఖ వేదికగా కేకేఆర్‌తో (రాత్రి 7:30) డీసీ తలపడనుంది. అన్ని అనుకూలిస్తే.. విశాఖలో రిషబ్‌ పంత్‌ మెరుపులు చూసే అవకాశం కూడా ఉంటుంది. పంత్‌ కారు ప్రమాదం తాలూకా గాయాల నుంచి పూర్తిగా కోలుకుని రానున్న ఐపీఎల్‌లో ఆడతాడని ప్రచారం జరుగుతుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)