Breaking News

IPL 2024 CSK VS KKR: ధోని రికార్డు సమం చేసిన జడేజా

Published on Tue, 04/09/2024 - 10:54

ఐపీఎల్‌ 2024లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్‌ (4-0-18-3) చేసి సీఎస్‌కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ (67 నాటౌట్‌) ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

బంతితో అద్భుతమైన ప్రదర్శనకు గాను జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున జడేజాకు ఇది 15వ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు. ఈ అవార్డుతో జడ్డూ సీఎస్‌కే తరఫున అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా ధోని సరసన చేరాడు. ఐపీఎల్‌లో ధోని సైతం సీఎస్‌కే తరఫున 15 ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్నాడు. సీఎస్‌కే తరఫున అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్ల జాబితాలో ధోని, జడ్డూల తర్వాత సురేశ్‌ రైనా (12), రుతురాజ్‌ గైక్వాడ్‌ (10), మైక్‌ హస్సీ (10) ఉన్నారు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌.. రవీంద్ర జడేజా, తుషార్‌ దేశ్‌పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్‌ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్‌ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. సాల్ట్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (3), రింకూ సింగ్‌ (9), రసెల్‌ (10) తస్సుమనిపించారు. నరైన్‌ (27), రఘువంశీ (24), శ్రేయస్‌ అయ్యర్‌ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్‌కేను రుతురాజ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి గెలిపించాడు. రచిన్‌ రవీంద్ర 15, డారిల్‌ మిచెల్‌ 25, శివమ్‌ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లు) చేసి ఔట్‌ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేకేఆర్‌ బౌలర్లలో వైభవ్‌ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్‌కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్‌ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్‌ రెండో స్థానంలో ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)