Breaking News

ఏంట్రా ఈ బ్యాటింగ్‌?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్‌ వైరల్‌

Published on Tue, 04/16/2024 - 12:50

‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్‌మేన్‌ సినిమాలో మహేశ్‌ బాబు చెప్పిన మాదిరే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టారు.

ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్‌.. లేదంటే ఫోర్‌.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్‌ హెడ్‌(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్‌ క్లాసెన్‌(31 బంతుల్లో 67) ఛాన్స్‌ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు.

వీరిద్దరి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ చూసి ఆరెంజ్‌ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు.

అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్‌ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! 

కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి
ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్‌ విరాట్‌ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్‌ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్‌లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు.

అదే సమయంలో వికెట్‌ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్‌ప్రెషన్స్‌, రియాక్షన్స్‌ చూసి ఫ్యాన్స్‌.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్‌ మండిపాటు
ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్‌ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్‌ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్‌ డుప్లెసిస్‌(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది.

ఇక ఆఖర్లో దినేశ్‌ కార్తిక్‌(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్‌ రావత్‌(14 బంతుల్లో 25 నాటౌట్‌) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది.

చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్‌, అగార్కర్‌ చర్చలు.. హార్దిక్‌ పాండ్యాకు నో ఛాన్స్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)