Breaking News

రోహిత్‌ శర్మ భారీ సిక్సర్‌.. బంతి ఎటో వెళ్లిపోయిందిగా! వీడియో వైరల్‌

Published on Thu, 03/30/2023 - 15:34

ఐపీఎల్‌-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైం‍ది. క్రికెట్‌ అభిమానులను ఊర్రుతూలూగించే ఈ ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌ శుక్రవారం(మార్చి 31) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌ వేదికగా డిఫెడింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడునున్నాయి. ఇక గతేడాది సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబై ఇండియన్స్‌.. ఈ సారి సరికొత్తగా బరిలోకి దిగబోతుంది. 

ఈ ఏడాది సీజన్‌కు ఆ జట్టు స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా, విధ్వంసకర ఆటగాడు టిమ్‌ డేవిడ్‌ దూరమయ్యారు. అయితే గత ఏడాది సీజన్‌కు దూరంగా ఉన్న ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా అర్చర్‌ మాత్రం ఐపీఎల్‌-16కు అందుబాటులో ఉన్నాడు. అదే విధంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ ముంబై ఇండియన్స్‌ తరపున ఐపీఎల్‌ అరంగేట్రం చేయనున్నాడు.

ఐపీఎల్‌ మినీ వేలం-2023లో ముంబై అతడి కోసం  ఏకంగా 17 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇక ఈ ఏడాది సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం కానున్నట్లు తెలుస్తోంది. అతడు అందుబాటులో లేని మ్యాచ్‌లకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవరించనున్నట్లు సమాచారం అందించినట్లు సమాచారం. ముంబై తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్‌ 2న బెంగళూరు వేదికగా ఆర్సీబీతో ఆడనుంది.

చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్‌
ఇక ఈ ఏడాది సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. బ్రబౌర్న్‌ వేదికగా ముంబై తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌ నేతృత్వంలో రోహిత్‌ సేన తమ ప్రా‍క్టీస్‌ సెషన్స్‌లో బీజీబీజీగా గడుపుతోంది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. తన ప్రాక్టీస్‌లో భాగంగా ఓ బౌలర్‌ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా హిట్‌మ్యాన్‌ మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2023: ముంబై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. రోహిత్‌ దూరం! కెప్టెన్‌గా సూర్యకుమార్‌

Videos

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)