Breaking News

IPL 2023: ఢిల్లీ ఔట్‌.. ఆ జట్లకు ఇంకా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉన్నాయా..?  

Published on Sun, 05/14/2023 - 13:21

నిన్న పంజాబ్‌ కింగ్స్‌ చేతిలో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక మిగిలింది 9 జట్లు. వీటిలో సన్‌రైజర్స్‌, కేకేఆర్‌ జట్లు కూడా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. అయితే టెక్నికల్‌గా వారి అవకాశాలను కొట్టిపారేయడానికి వీల్లేదు. 

సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు: 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది. 

కేకేఆర్‌: 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్‌.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవడమే కాకుండా, మిగతా జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంది. 

ఆర్సీబీ: 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు (-0.345) సాధించి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఆర్సీబీ‌.. తాము ఆడాల్సిన మూడు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచి, నెట్‌ రన్‌రేట్‌పై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్‌, ముంబై, పంజాబ్‌, లక్నో జట్ల గెలుపోటములు కూడా ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 

పంజాబ్‌: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (-0.268) సాధించి, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న పంజాబ్‌‌.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్‌లో ఓడితే ఆర్సీబీ, రాజస్థాన్‌, ముంబై, లక్నో జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది.

రాజస్థాన్‌: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు (0.633) సాధించి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న రాజస్థాన్‌‌‌.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. 

లక్నో: 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు (0.309) సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న లక్నో‌‌.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. రాజస్థాన్‌, పంజాబ్‌, ఆర్సీబీ, ముంబై జట్లు తలో మ్యాచ్‌ ఓడిపోవాల్సి ఉంటుంది. ఇదే జరిగితే లక్నో 15 పాయింట్లతో ఫైనల్‌ ఫోర్‌కు చేరుకుంటుంది. రాజస్థాన్‌, పంజాబ్‌, ఆర్సీబీ టీమ్‌లు 14 పాయింట్లతో లీగ్‌ నుంచి నిష్క్రమిస్తాయి.

ముంబై: 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు (-0.117) సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ముంబై.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. రాజస్థాన్‌ కంటే మెరుగైన రన్‌రేట్‌ సాధించడమో లేక రాజస్థాన్‌ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌లో ఓటమిపాలయ్యేందుకు ఎదురు చూడాలి. 

సీఎస్‌కే: 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 15 పాయింట్లు (0.493) సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సీఎస్‌కే.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. అదే రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరే రెండో జట్టుగా నిలుస్తుంది. 

గుజరాత్‌: 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు (0.761) సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌.. తాము ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌ గెలిచినా టేబుల్‌ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 

చదవండి: లక్నో సూపర్‌ జెయింట్స్‌ కోచ్‌ అసభ్య ప్రవర్తన
 ​ 
 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)