Breaking News

LSG Vs RCB: కోహ్లి-గంభీర్‌ మధ్యే కాదు.. లక్నో-ఆర్సీబీ మధ్య కూడా యుద్ధం జరిగింది..!

Published on Tue, 05/02/2023 - 13:52

అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ స్టేడియం వేదికగా నిన్న (మే 1) జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి-నవీన్‌ ఉల్‌ హాక్‌-గౌతమ్‌ గంభీర్‌ల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఓ దశలో కోహ్లి-గంభీర్‌లు కొట్టుకునేంత వరకు కూడా వెళ్లారు. నవీన్‌ సైతం ఏమాత్రం తగ్గలేదు. కోహ్లి తనను టార్గెట్‌ చేసిన ప్రతిసారి కౌంటర్‌ అటాక్‌ చేశాడు. కెప్టెన్‌ రాహుల్‌ కోహ్లికి సారి చెప్పమన్నా, ఈ ఆఫ్ఘానీ ఎంత మాత్రం తగ్గలేదు. గంభీర్‌ సపోర్ట్‌ చేస్తుండటంతో నవీన్‌ మరింత రెచ్చిపోయాడు.

మ్యాచ్‌ అనంతరం (మే 2) నవీన్‌.. కోహ్లితో సోషల్‌మీడియా వార్‌కు కూడా దిగాడు. కోహ్లి చేసిన పోస్ట్‌కు కౌంటర్‌గా మరో పోస్ట్‌ పెట్టాడు. ఈ రెండు పోస్ట్‌లు ఒకదానితో ఒకటి సంబంధం లేనివే అయినప్పటికీ.. కోహ్లి పోస్ట్‌ చేసిన కొద్ది నిమిషాల్లోనే నవీన్‌ కూడా తన ఇన్‌స్టాలో ఓ స్టోరీ పోస్ట్‌ చేయడం​తో అందరూ దీన్ని కౌంటర్‌ అటాక్‌ అనుకుంటున్నారు. 

ఓ పక్క మైదనంలో కోహ్లి-నవీన్‌-గంభీర్‌ల మధ్య వన్‌ టు టూ ఫైట్‌ నడుస్తుంటే.. మరోపక్క కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ, గతంలో జరిగిన ఓ సన్నివేశాన్ని టార్గెట్‌ చేస్తూ లక్నో సూపర్‌ జెయింట్స్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చింది.  

ప్రస్తుత సీజన్‌లోనే ఇరు జట్ల మధ్య ఏప్రిల్‌ 10న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం అనంతరం లక్నో టీమ్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌, ఇదే మీరు ధైర్యంగా ఆడే విధానం అంటూ ఆర్సీబీని కించపరిచే విధంగా ట్వీట్‌ చేసింది. దీనికి బదులుగా నిన్న లక్నోపై విజయానంతరం ఆర్సీబీ కూడా ఓ ట్వీట్‌ చేసింది. ఈ విధంగా మేము ధైర్యంగా ఆడతాము అంటూ లక్నోకు టిట్‌ ఫర్‌ టాట్‌ చేసి చూపించింది. కాగా, ఆర్సీబీ ఈ ఏడాది ప్లే బోల్డ్‌ అనే నినాదంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.   

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)