Breaking News

ఇదేమైనా టీమిండియానా? గెలిస్తే క్రెడిట్‌ తీసుకుని.. ఓడితే వేరే వాళ్లను నిందిస్తూ..

Published on Sun, 04/16/2023 - 12:44

IPL 2023 RCB Vs DC- Sehwag Slams Ricky Ponting: ‘‘ఒక జట్టు గెలిస్తే క్రెడిట్‌ కోచ్‌కి ఇస్తారు. మరి ఓడిపోయినప్పుడు జవాబుదారీగా ఉండాల్సింది కూడా వాళ్లే కదా! గతంలో అన్నట్లుగా ఇప్పుడు అదే మాట చెప్తున్నా.. రిక్కీ పాంటింగ్‌ కోచ్‌గా అద్భుతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. గత కొన్నేళ్లుగా వాళ్లు ప్రతి సీజన్‌లో దాదాపు ప్లే ఆఫ్స్‌ చేరుకుంటున్నారు. వీటన్నింటికీ క్రెడిట్‌ తీసుకుంటున్న రిక్కీ పాంటింగ్‌.. ఓటములకు కూడా బాధ్యత వహించాలి. 

ఇదేమైనా టీమిండియా అనుకున్నావా
ఇదేమీ టీమిండియా కాదు.. గెలిచినప్పుడు క్రెడిట్‌ మాదే అని చెప్పుకొంటూ.. ఓడినపుడు మాత్రం ఇంకెవరినో నిందిస్తూ బాధ్యులను చేయడానికి! నిజానికి ఐపీఎల్‌లో కోచ్‌ పాత్ర సున్నా. ఆటగాళ్లకు తమపై తాము విశ్వాసం కోల్పోకుండా ప్రతి మేనేజ్‌మెంట్‌ అన్ని రకాలుగా అండగా నిలవాలి. అయితే, జట్టు మెరుగైన ప్రదర్శన చేసినపుడు మాత్రమే కోచ్‌కు విలువ వస్తుంది.

ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా లోపాలు తెలుసుకుని.. వాటిని సరిచేసుకుంటేనే ముందుకు సాగే అవకాశం ఉంటుంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు.

పాంటింగ్‌ అసలేం చేస్తున్నాడు?
ఢిల్లీ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించాడు. గెలిచినపుడు క్రెడిట్‌ తీసుకోవడం కాదని.. వరుస ఓటములకు బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌-2023లో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయాల సంఖ్య ఐదుకు చేరింది. తాజా ఎడిషన్లో ఇంతవరకు ఒక్క గెలుపు కూడా నమోదు చేయని జట్టుగా వార్నర్‌ బృందం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆడిన ఐదింటిలో ఐదు ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

లోపాలు సవరించుకోవాలి
ఈ నేపథ్యంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి అనంతరం క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ వీరూ భాయ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరుస పరాజయాలకు కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ను బాధ్యుడిని చేయాలని పేర్కొన్నాడు. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గమనించి.. పొరపాట్లు సరిచేసుకోవాలని సూచించాడు. లేదంటే చెత్త రికార్డులతో ఇంటిబాట పట్టక తప్పదని హెచ్చరించాడు. 

చదవండి: గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ..
సెంచరీతో చెలరేగిన బాబర్‌.. ఎవరికీ అందనంత ఎత్తులో!

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?