Breaking News

కేకేఆర్‌కు మరో బిగ్‌షాక్‌.. స్టార్‌ ఆటగాళ్లు దూరం!

Published on Sat, 03/18/2023 - 15:48

ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్లు షకీబ్ అల్ హసన్, లిట్టన్ కుమార్ దాస్‌లు దూరం కానున్నారు. స్వదేశంలో ఐర్లాండ్‌ సిరీస్‌ నేపథ్యంలో.. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు షకీబ్, లిటన్‌ దాస్‌కు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మంజూరు చేయలేదు.

ఐర్లాండ్‌ బంగ్లా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. ఈ సుదీర్ఘ సిరీస్‌ మార్చి 18 నుంచి ఏప్రిల్ 8 వరకు జరగనుంది. అనంతరం బంగ్లా ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలతో కలిసే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికే కేకేఆర్‌ తమ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సేవలను కోల్పోగా.. ఇప్పడు షకీబ్‌, లిటన్‌ దాస్‌ దూరం కావడం నిజంగా బిగ్‌ షాక్‌ అనే చెప్పుకోవాలి. అదే విధంగా గాయపడిన శ్రేయస్‌ స్థానం‍లో షకీబ్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని కేకేఆర్‌ మెనెజెమెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

                         

ఈ నేపథ్యంలో షకీబ్‌ కూడా దూరం కావడంతో కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడాతరన్నది వేచి చూడాలి. కాగా ఐపీఎల్‌ 16వ సీజన్‌ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది.
చదవండి: IND vs AUS: హార్దిక్‌పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)