Breaking News

అర్జున్‌ టెండూల్కర్‌ను చెడుగుడు ఆడుకున్న వెంకటేశ్‌ అయ్యర్‌

Published on Sun, 04/16/2023 - 16:30

ముంబైలోని వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ బౌల్‌ చేసిన అర్జున్‌.. కాస్త మెరుగ్గానే బౌలింగ్‌ చేసినప్పటికీ, తన రెండో ఓవర్‌లో మాత్రం వెంకటేశ్‌ అయ్యర్‌ చేతికి చిక్కి బలయ్యాడు.


Photo Credit : IPL Website
ఈ ఓవర్‌లోనూ తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వని అర్జున్‌.. ఆ తర్వాత బంతిని వైడ్‌ వేసి, ఆ వెంటనే వరుసగా 2 పరుగులు, 0, బౌండరీ, సిక్సర్‌ సమర్పించుకున్నాడు. ఈ ఓవర్‌లో అయ్యర్‌ ధాటికి మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవడంతో కెప్టెన్‌ సూర్యకుమార్‌ అర్జున్‌ను బౌలింగ్‌ నుంచి తప్పించి డ్యూయాన్‌ జన్సెన్‌కు బంతిని అప్పజెప్పాడు.

కాగా, సుదీర్ఘకాలంగా (రెండేళ్లుగా) ఐపీఎల్‌ ఎంట్రీ కోసం ఎదురుచూసిన అర్జున్‌కు ఓ మోస్తరు ప్రారంభమైతే లభించింది. ఎన్నో అంచనాల నడుమ కుటుంబ సభ్యుల సమక్షంలో బరిలోకి దిగిన అర్జున్‌ తొలి ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనించాడు. అయితే రెండో ఓవర్‌లో మాత్రం అర్జున్‌ కాస్త తడబడ్డాడు. తన కోటా ఓవర్లు మొత్తం పూర్తయితే కాని అతను బౌలింగ్‌పై ఓ అంచనాకు రాలేని పరిస్థితి.  ఇక్కడ ఓ గమనించదగ్గ విషయం ఏంటంటే.. అర్జున్‌ తొలి బంతి నుంచి రన్‌అప్‌తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. అతని శైలి ఆశిష్‌ నెహ్రాను తలపించినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం వేగం లోపించింది. అతను బౌల్‌ చేసిన 13 బంతులు 130కిమీ వేగం లోపే ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. 8.1 ఓవర్ల తర్వాత 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్భాజ్‌ (8), జగదీశన్‌ (0), నితీశ్‌ రాణా (5) ఔట్‌ కాగా.. వెంకటేశ్‌ అయ్యర్‌ (22 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)