Breaking News

MI VS CSK: వారెవ్వా జడ్డూ భాయ్‌.. నువ్వు సూపర్‌.. ఎందుకో చదవండి..!

Published on Sun, 04/09/2023 - 13:14

ఇటీవలికాలంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, సీఎస్‌కే కీలక ప్లేయర్‌ రవీంద్ర జడేజా పట్టిందల్లా బంగారమే అవుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోట విజయమే పలకరిస్తుంది. గాయం కారణంగా గతేడాది ఓ మోస్తరు విరామం తీసుకున్న జడ్డూ భాయ్‌, ఆ మధ్యలోనే జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రివాబాను ఎమ్మెల్యేగా గెలిపించుకుని, ఆతర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు.

రీఎంట్రీలో తొలి మ్యాచ్‌లోనే (రంజీ ట్రోఫీతో తమిళనాడుపై 8 వికెట్లు) అదరగొట్టిన జడ్డూ భాయ్‌, ఆతర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సిరీస్‌లో (బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇరగదీసిన అతను, భారత్‌ గెలిచిన తొలి రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల్లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుపొందాడు.

అతర్వాత ఆసీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెచ్చిపోయిన జడేజా, తొలి వన్డేలో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో మరో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా జడ్డూ మరో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు కూడా దక్కించుకుని, ఈ అవార్డుకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 8) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో (4-0-20-3) అద్భుత ప్రదర్శన కనబర్చి ఈ అవార్డును దక్కించుకున్నాడు.

గత 10 మ్యాచ్‌ల్లో జడేజా ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగో సారి కావడం విశేషం. మరో విశేషమేమిటంటే.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా.. అమిత్‌ మిశ్రా (12), రహానే (12), కేఎల్‌ రాహుల్‌లతో సమంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్‌ శర్మ (18) అగ్రస్థానంలో ఉండగా.. ధోని (17), యూసఫ్‌ పఠాన్‌ (16), కోహ్లి (14), రైనా (14), గంభీర్‌ (13) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో ఉన్నారు. 


 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)