Breaking News

కేకేఆర్‌తో మ్యాచ్‌.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్‌! సన్‌రైజర్స్‌ తుది జట్టు ఇదే

Published on Fri, 04/14/2023 - 10:57

KKR vs SRH Probable Playing XIs: ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్దమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది. పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచి ఈ మెగా ఈవెంట్‌లో బోణీ కొట్టిన ఆరెంజ్‌ ఆర్మీ.. అదే జోరును కేకేఆర్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

వరుసగా విఫలమవుతున్న ఇంగ్లండ్‌ పవర్‌ హిట్టర్‌ హ్యరీ బ్రూక్‌ను పక్కన పెట్టాలని ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ మెనెజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 13 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్న  బ్రూక్‌ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక అతడి స్థానంలో న్యూజిలాండ్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ పిలిఫ్స్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ స్ధానంలో అభిషేక్‌ శర్మ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో సుందర్‌ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు.

ఇక ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో సన్‌రైజర్స్‌ బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా రాహుల్‌ త్రిపాఠి, కెప్టెన్‌ మార్‌క్రమ్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.. ఇక బౌలింగ్‌ పరంగా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ పటిష్టంగా ఉంది.

ఉమ్రాన్‌ మాలిక్‌, భువీ, నటరాజన్‌ వంటి స్పీడ్‌ స్టార్లు ఉన్నారు. మరోవైపు కేకేఆర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్‌ ఉంది. గుర్భాజ్‌ స్ధానంలో జాసన్‌ రాయ్‌ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.

పిచ్‌ రిపోర్ట్‌
ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అకుకూలిస్తుంది. ఇదే స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్‌ నమోదైంది. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్‌లు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ వికెట్‌పై స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్లు(అంచనా)

కోల్‌కతా నైట్ రైడర్స్ :
జాసన్‌ రాయ్‌, నారాయణ్ జగదీశన్(వికెట్‌ కీపర్‌), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్:
గ్లెన్‌ ఫిలిప్స్‌, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌ కీపర్‌), అభిషేక్‌ శర్మ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
చదవండి: IPL 2023: గిల్‌ క్లీన్‌ బౌల్డ్‌.. ప్రీతీ జింటా రియాక్షన్‌ సూపర్‌! వీడియో వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)