Breaking News

స్వదేశానికి కేకేఆర్‌ క్రికెటర్‌.. ఆడింది ఒక్కటే మ్యాచ్‌!

Published on Fri, 04/28/2023 - 17:50

కేకేఆర్‌ ఆటగాడు.. స్టార్‌ క్రికెటర్‌ లిటన్‌ దాస్‌ బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడిన లిటన్‌ దాస్‌ కుటుంబ సమస్యల కారణంగా అర్థంతరంగా లీగ్‌ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని కేకేఆర్‌ ట్విటర్‌లో అధికారికంగా ద్రువీకరించింది.

''లిటన్‌ దాస్‌ బంగ్లాదేశ్‌కు పయనమయ్యాడు. ఇది మాకు నష్టం కలిగించేది. కానీ కుటుంబంలో మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అతను వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది. ఈ కష్ట సమయం నుంచి లిటన్‌ దాస్‌ తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్‌ చేసింది.

ఇక గతేడాది జరిగిన వేలంలో యాక్సిలరేటెడ్‌ రౌండ్‌లో కనీస ధర రూ.50 లక్షలకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఏప్రిల్‌ 20న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా లిటన్‌దాస్‌ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటైన ఈ వికెట్‌ కీపర్‌ లలిత్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ల స్టంపౌట్‌ చాన్స్‌ మిస్‌ చేసుకున్నాడు. 

ఇక ఆర్‌సీబీపై విజయంతో కేకేఆర్‌ ఈ సీజన్‌లో నాలుగు వరుస పరాజయాలకు చెక్‌ పెట్టింది. ప్రస్తుతం ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ఏప్రిల్‌ 29న ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా తర్వాతి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఎదుర్కోనుంది.

చదవండి: వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌ చరిత్ర.. అయినా టీమిండియా వెనకాలే

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)