Breaking News

IPL 2023 QF 1: సీఎస్‌కే-గుజరాత్‌ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్‌ అయ్యిందా..?

Published on Wed, 05/24/2023 - 09:06

చెన్నై సూపర్‌ కింగ్స్‌-గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య నిన్న (మే 23) జరిగిన క్వాలిఫయర్‌ 1 మ్యాచ్‌పై కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఉద్దేశపూర్వకంగానే ఓడిందని వారు ఆరోపిస్తున్నారు. ఇందుకు పలు విషయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు.

  • బౌలర్లు ఈ సీజన్‌లో ఎన్నడూ లేనంత ఉదాసీనంగా వ్యవహరించారని, వికెట్లు తీసి పరుగులు నియంత్రించినప్పటికీ అది వారి స్థాయి కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
  • కష్టసాధ్యంకాని లక్ష్య ఛేదనలో (173) బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా వికెట్లు పారేసుకున్నారని, అంపైర్లు కరెక్ట్‌గా లేకపోయినా కెప్టెన్‌ నుంచి ఎటువంటి స్పందన లేదని అంటున్నారు.
  • తెవాతియా, మిల్లర్‌ నిర్లక్ష్యమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవడాన్ని, ఫీల్డర్‌ మార్చడాన్ని గమనించినా హార్ధిక్‌ అటువైపే షాట్‌ ఆడి ఔట్‌ కావడాన్ని ఇందుకు ఉదహరిస్తున్నారు.
  • అనుమానాస్పదంగా ఉన్న విజయ్‌ శంకర్‌ క్యాచ్‌ను పూర్తిగా పరిశీలించకుండానే థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడం, రీప్లేలో బంతి నేలకు తాకినట్లు కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని చర్చించుకుంటున్నారు.

  • పతిరణ విషయంలోనూ (16వ ఓవర్‌) అంపైర్లు ధోనికి తలొగ్గారని, రూల్స్‌ వ్యతిరేకమైనా వారు పతిరణను బౌలింగ్‌ చేయనిచ్చారని ఆరోపిస్తున్నారు.
  • ఎన్నడూ లేని విధంగా గుజరాత్‌ ఆలౌట్‌ కావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

వీరి ఆరోపణలు, అనుమానాలను పక్కకు పెడితే.. నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌ను ఓడించడంతో సీఎస్‌కే 10వ సారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది. సీఎస్‌కే ఆటగాళ్లు సమష్టిగా రాణించి గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించారు. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్‌ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు.

చదవండి: CSK VS GT: ధోని తొండాట.. మ్యాచ్‌ 4 నిమిషాలు ఆలస్యం

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)