Breaking News

IPL 2023: 'రిజర్వ్‌ డే'కు ఫైనల్‌ మ్యాచ్‌.. ధోని రిటైర్మెంట్‌కు సంకేతమా..?

Published on Mon, 05/29/2023 - 11:21

ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు (మే 29, రిజర్వ్‌ డే) ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పాటు యావత్‌ భారత క్రికెట్‌ అభిమానులకు ఓ భయం పట్టుకుంది. ఈ సీజన్‌తోనే ధోని తన ఐపీఎల్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతాడేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచే తలాకు ఆఖరిదవుతుందేమోనని కలత చెందుతున్నారు. ధోని రిటైర్మెంట్‌ విషయంలో ఫ్యాన్స్‌కు ఉన్న భయాల వెనుక ఓ బలమైన కారణం ఉంది. 

ధోని.. తన అంతర్జాతీయ కెరీర్‌లోని చివరి మ్యాచ్‌ను రిజర్వ్‌ డే రోజునే ఆడాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్లో షెడ్యూల్‌ ప్రకారం న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డేకు (జులై 10) వాయిదా పడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. ఏడాది అనంతరం 2020, ఆగస్ట్‌ 15వ తేదీన ధోని అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించాడు.  

తాజాగా ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రిజర్వ్‌ డే కు వాయిదా పడటంతో అభిమానులు భయపడుతున్నారు. ధోని తన అంతర్జాతీయ క్రికెట్‌కు ఎలాగైతే వీడ్కోలు పలికాడో, ఐపీఎల్‌కు కూడా అలాగే రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడేమోనని దిగులుపడుతున్నారు. తలా లేని ఐపీఎల్‌ను ఊహించుకోలేమంటూ వాపోతున్నారు. 

ధోని అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన చివరి మ్యాచ్‌ను, ఐపీఎల్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ను కంపేర్‌ చేసుకుంటూ తెగ ఫీలైపోతున్నారు. ధోనికి అంతర్జాతీయ క్రికెట్‌లో చివరి మ్యాచ్‌ (వన్డే) 350వదని, ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ అతనికి 250వదని చెప్పుకుంటూ ధోని రిటైర్మెంట్‌పై నిర్ధారణకు వచ్చేశారు. ధోని రిటైర్మెంట్‌కు లెక్కలు కూడా అనుకూలిస్తున్నాయంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే, గుజరాత్‌-చెన్నై జట్ల మధ్య నిన్న (మే 28) జరగాల్సిన ఐపీఎల్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రిజర్వ్‌ డే (మే 29)కు వాయిదా పడిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా రిజర్వ్‌ డే రోజు కూడా మ్యాచ్‌ సాధ్యపడకపోతే, లీగ్‌ దశలో టేబుల్‌ టాపర్‌ అయిన గుజరాత్‌ను విజేతగా ప్రకటిస్తారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళ జల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.

చదవండి: IPL 2023 Final: మళ్లీ అదే రోజు గెలవాలని రాసి పెట్టిందేమో.. వరుణుడు కూడా సహకరించాడు..!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)