Breaking News

కోహ్లి పేరిట అలా చేయడాన్ని ఆస్వాదిస్తాను: నవీన్‌ ఉల్‌ హక్‌

Published on Thu, 05/25/2023 - 12:37

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ప్రేక్షకులు.. కోహ్లి నామస్మరణ చేస్తూ తనను అవహేళన చేయడంపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ స్పందించాడు. ఇలా చేయడం వల్ల తనలో కసి పెరిగి ఇంకా బాగా ఆడతానని ఆయన అన్నాడు. వాస్తవానికి మైదానంలో ప్రేక్షకులు ఎవరి పేరును జపించినా తాను ఆస్వాధిస్తానని, కోహ్లి పేరును జపించడం అదనపు కిక్‌ను ఇస్తుందని తెలిపాడు.   

తాను బరిలో ఉన్నప్పుడు బయటి శబ్దాలపై దృష్టి పెట్టనని, నా పని నేను చేసుకుంటూ పోతానని అన్నాడు. స్టాండ్స్‌లో ప్రేక్షకులు చేసే అల్లరి తనను ప్రభావితం చేయదని, ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా నేను దాన్ని పెద్దగా పట్టించుకోనని తెలిపాడు. ఏ క్రీడలో అయినా బాగా ఆడినప్పుడు ప్రశంసలు, తేలిపోయినప్పుడు విమర్శలు తప్పవని చెప్పుకొచ్చాడు. 

కాగా, ముంబై ఇండియన్స్‌తో నిన్న (మే 24) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌ సందర్భంగా చిదంబరం స్టేడియంలోని ప్రేక్షకులు నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌కు వచ్చిన సమయంలో కోహ్లి నామస్మరణతో స్టేడియం మొత్తాన్ని మార్మోగించారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ప్రెస్‌ మీట్‌లో నవీన్‌.. కోహ్లి అంశంపై స్పందించాడు. 

ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్‌లో నవీన్‌ (4/34) అద్భుతంగా రాణించినప్పటికీ లక్నో జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా.. ఛేదనలో ఆకాశ్‌ మధ్వాల్‌ (3.3-0-5-5) ధాటికి కుదేలైన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైంది. 

చదవండి: కోహ్లితో కదా వైరం.. రోహిత్‌ ఏం చేశాడు!

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హైటెక్ సిటీలో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు (ఫొటోలు)

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)