Breaking News

అందుకే అక్షర్‌తో బౌలింగ్‌ చేయించలేదు.. మా నుంచి అతడు మ్యాచ్‌ లాగేసుకున్నాడు!

Published on Wed, 04/05/2023 - 11:03

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అద్భుతంగా రాణించాడు. టాపార్డర్‌లో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37), సర్ఫరాజ్‌ ఖాన్‌(30) మినహా మిగతా వాళ్లు విఫలమైన వేళ అక్షర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు సాధించాడు.

ఈ క్రమంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేయగలిగింది. కానీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ను సాయి సుదర్శన్‌(62), డేవిడ్‌ మిల్లర్‌ (31) ఆఖరి వరకు అజేయంగా నిలిచి విజయతీరాలకు చేర్చారు.

దీంతో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐపీఎల్‌-2023లో వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. గుజరాత్‌తో మ్యాచ్‌లో అక్షర్‌ చేతికి వార్నర్‌ బంతినివ్వకపోవడం చర్చనీయాంశమైంది. 

అందుకే అక్షర్‌ చేతికి బంతినివ్వలేదు.. అతడు మ్యాచ్‌ లాగేసుకున్నాడు
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ఢిల్లీ కెప్టెన్‌ వార్నర్‌ భాయ్‌.. తన నిర్ణయానికి గల కారణాన్ని వెల్లడించాడు. ‘‘మ్యాచ్‌ ఆరంభంలోనే గుజరాత్‌ సీమర్లను చూసి నేను ఆశ్చర్యపోయాననుకోకండి. నిజానికి ఊహించిన దానికంటే బంతి మరింత ఎక్కువగా స్వింగ్‌ అయింది.

పరిస్థితులకు అనుగుణంగా ఎలా బౌలింగ్‌ చేయాలో వాళ్లు(గుజరాత్‌) చూపించారు. ఇంకా ఇక్కడ మరో ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆరంభ ఓవర్లలో బంతి ఇలాగే స్వింగ్‌ అయ్యే అవకాశం ఉంది. నిజానికి ఆఖరి వరకు మేము గెలుస్తామనే నమ్మకం ఉండింది.

అయితే, సాయి అద్బుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. ఇక మిల్లర్‌ గురించి చెప్పేదేముంది. అతడు ఏం చేయగలడో అదే చేశాడు. నిజానికి డ్యూ(తేమ) ఎక్కువగా ఉంది. ఇలాంటి చోట 180-190 వరకు స్కోర్‌ చేస్తేనే మ్యాచ్‌ను కాపాడుకోగలం.

అంతేగానీ అతడికి(అక్షర్‌ను ఉద్దేశించి) బౌలింగ్‌ ఇవ్వకపోవడం వల్ల కాదు’’ అని వార్నర్‌ తెలిపాడు. సీమర్లకు అనుకూలించే వికెట్‌పై స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ చేతికి బంతినివ్వలేదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఢిల్లీ చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 18 పరుగులు ఇచ్చాడు. 

చదవండి: IPL 2023: చెత్తగా ఆడుతున్నాడు.. వాళ్లను చూసి నేర్చుకో! సెహ్వాగ్‌ ఘాటు విమర్శలు
DC Vs GT: రానున్న రెండేళ్లలో ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌తో పాటు టీమిండియాలో కూడా!

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)