Breaking News

ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..!

Published on Thu, 04/13/2023 - 16:50

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్లలో ఒకడైన సందీప్‌ శర్మ, నిన్న (ఏప్రిల్‌ 12) చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా చాలా రోజుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌ 2023 వేలంలో అమ్ముడుపోని సందీప్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ గాయపడిన ప్రసిద్ధ్‌ కృష్ణకు రీప్లేస్‌మెంట్‌గా ఎంచుకుంది. సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సందీప్‌, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

గతంలో చాలా సందర్భాల్లో వేర్వేరు ఫ్రాంచైజీలకు తన టాలెంట్‌తో అద్భుత విజయాలనందించిన సందీప్‌.. నిన్న సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌ అద్భుతంగా బౌల్‌ చేసి ప్రత్యర్ధిని గెలవనీయకుండా చేశాడు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి రాగా.. సందీప్‌ తొలి రెండు బంతులను వైడ్‌లుగా, ఆతర్వాత వరుసగా 2 సిక్సర్లు సమర్పించకుని తన జట్టు ఓటమికి కారకుడయ్యేలా కనిపించాడు. అయితే ఈ బ్రిలియంట్‌ బౌలర్‌ చివరి 3 బంతులను అద్భుతంగా బౌల్‌ చేసి క్రీజ్‌లో ఉన్న అరివీర భయంకరులైన ధోని, జడేజాలను కట్టడి చేశాడు.

చెన్నై గెలుపుకు 3 బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. సందీప్‌ తన అనుభవాన్నంతా రంగరించి, అద్భుతమైన యార్కర్‌ లెంగ్త్‌ బంతులను సంధించాడు. అప్పటికే మాంచి ఊపు మీద ఉన్న ధోని, జడేజాలను నిలువరించడం సందీప్‌కు కత్తిమీద సామే అయినప్పటికీ, తన బౌలింగ్‌ ప్రతిభతో ఎలాగోలా మేనేజ్‌ చేశాడు. ఫలితంగా రాజస్థాన్‌ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సందీప్‌ ఒక్క రాత్రిలో తాను కోల్పోయిన స్టార్‌డమ్‌నంతా తిరిగి తెచ్చుకున్నాడు. ఫ్యాన్స్‌ సందీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చివరి బంతికి 6 పరుగులు కావాల్సిన తరుణంలో అప్పటికే జోరుమీదున్న ధోనిని అద్భుతంగా కట్టడి చేశాడంటూ అభినందిస్తున్నారు. కెప్టెన్‌ సంజూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మ్యాచ్‌ను కాపాడాడంటూ కొనియాడుతున్నారు. ఇలాంటి బౌలర్‌ 2023 వేలంలో అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిదంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఐపీఎల్‌లో 2013 నుంచి వివిధ ఫ్రాంచైజీల తరఫున 106 మ్యాచ్‌లు ఆడి 116 వికెట్లు పడగొట్టిన  సందీప్‌ను ఈ ఏడాది వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని విషయం తెలిసిందే. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)