Breaking News

అతన్ని వదులుకోవడం కేకేఆర్‌ చేసిన అతి పెద్ద తప్పిదం.. 

Published on Sat, 09/25/2021 - 17:55

Releasing Suryakumar Yadav Was KKRs Biggest Loss: తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం చేసిన అతి పెద్ద పొరపాటుపై ఆ జట్టు మాజీ సారధి గౌతమ్‌ గంభీర్‌ నోరువిప్పాడు. అలాగే, కేకేఆర్‌ సారధిగా తనకుండిన ఏకైక విచారంపై ఆయన తన మనసులోని మాటను బయటపెట్టాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు ప్రాతనిధ్యం వహిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను వదులుకోవడం కేకేఆర్‌ చేసిన అతి పెద్ద తప్పిదం అని, సూర్యకుమార్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ప్రమోట్‌ చేయలేకపోవడం తనకుండిన ఏకైక విచారమని పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ విషయంలో కేకేఆర్‌ అంచనా తప్పిందని, అతను కేకేఆర్‌ను వదిలి ముంబైకి వెళ్లాక అతని దశ తిరిగిందని అభిప్రాయపడ్డాడు. 

ముంబై జట్టు అతనిలోని సామర్ధ్యాన్ని గుర్తించి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ చేయడం అతని కెరీర్‌లో కీలక మలుపు అని అన్నాడు. సూర్యకుమార్‌ కేకేఆర్‌కు ఆడుతున్న సమయంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపాలని అనుకున్నా, మనీశ్‌ పాండే, యూసఫ్‌ పఠాన్‌ లాంటి ఆటగాళ్లు ఉండడంతో అది సాధ్యపడలేదని వివరించాడు. ప్రస్తుతం సూర్యకుమార్‌ కెరీర్‌ శిఖరాగ్ర స్థాయిలో కొనసాగుతుందని, భవిష్యత్తులో అతను ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని జోస్యం చెప్పాడు. 

కాగా, 2012లో ముంబై తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు కేకేఆర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  ఆ సమయంలో లోయర్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతను.. అడపాదడపా మెరుపులు మినహా సాధించిందేమీ లేదు. అయితే 2018 సీజన్లో కేకేఆర్‌ను వీడి ముంబై జట్టుకు వచ్చాక బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ లభించడంతో అతని దశ తిరిగంది. ఆ సీజన్‌లో అతను ఏకంగా 512 పరుగులు సాధించాడు. ఆ తర్వాత సూర్యకుమార్‌ వెనక్కు తిరగి చూడలేదు. 2019లో 424 పరుగులు, 2020లో 480 పరుగులు సాధించాడు. ఈ పెర్ఫార్మెన్స్‌ కారణంగానే అతను టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన సూర్య 181 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఓవరాల్‌గా 110 మ్యాచ్‌లు ఆడిన అతను.. 134.36 స్ట్రయిక్‌ రేట్‌తో 2205 పరుగులు స్కోర్‌ చేశాడు. ఇందులో 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: అలా జరిగితే అఫ్గాన్‌ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్‌

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)