Breaking News

Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు

Published on Thu, 10/07/2021 - 12:47

SRH Umran Malik Father Gets Emotional: తమ కుమారుడు ఏదో ఒకరోజు తప్పకుండా టీమిండియా తరఫున ఆడతాడని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తండ్రి అబ్దుల్‌ మాలిక్‌ అన్నారు. మూడేళ్ల నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న తమ కొడుకు.. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. టీవీలో తన ఆట చూసుకుంటూ మురిసిపోతున్నామని పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ నటరాజన్‌కు కరోనా సోకడంతో.. ఉమ్రాన్‌ మాలిక్‌కు జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో ఐపీఎల్‌-2021 రెండో అంచెలో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా బంతిని(సుమారు 153 కి.మీ. వేగం) విసిరిన ఉమ్రాన్‌ మాలిక్‌... ఇక బుధవారం నాడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ కెరీర్‌లో తన తొలి వికెట్‌ నమోదు చేశాడు. 

ఈ నేపథ్యంలో ఉమ్రాన్‌ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అతడి తండ్రి అబ్దుల్‌ మాలిక్‌ ఇండియా టుడేతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల వయసు నుంచే నా కుమారుడికి క్రికెట్‌ అంటే బాగా ఇష్టం. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ కావాలన్నది తన కల. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తుదిజట్టులో తను చోటు దక్కించుకోవడం మాకు అమితానందాన్ని ఇచ్చింది. మేమంతా టీవీకే అతుక్కుపోయాం. తెరపై ఉమ్రాన్‌ను చూసి నా భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మా కొడుకు చాలా కష్టపడ్డాడు. తను ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

పేద కుటుంబం మాది..
‘‘నేను పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాది చాలా పేద కుటుంబం. అలాంటిది మా కొడుకు ఐపీఎ‍ల్‌లో ఆడటం నిజంగా మాకెంతో గొప్ప విషయం. ఉమ్రాన్‌ మమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇప్పుడు మా సంతోషానికి హద్దులు లేవు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా మాకు అభినందనలు తెలిపారు. ఆ భగవంతుడి దయతో ఉమ్రాన్‌ తన కెరీర్‌లో దూసుకుపోవాలి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

చదవండి: Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్‌ ప్రశంసలు

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)