Breaking News

ట్రాన్స్‌జెండర్లపై ఐఓసీ ఓ నిర్ణయానికి రావాలి

Published on Thu, 03/06/2025 - 03:59

బెర్లిన్‌: లింగమార్పిడి చేసుకున్న క్రీడాకారుల్ని విశ్వక్రీడల్లో అనుమతించే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఐఓసీ ఉపాధ్యక్షుడు యువాన్‌ ఆంటోని సమరాంచ్‌ సూచించారు. ‘ఈ విషయంలో యావత్‌ ప్రపంచం ఐఓసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మహిళా అథ్లెట్లు నష్టపోకుండా  అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు దిక్సూచిలా వ్యవహరించే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకోవాలి. దీనిపై తాత్సారం చేయకుండా శాస్త్రీయమైన కారణాలను పరిశీలించి వెంటనే ఓ నిర్ణయానికి రావాలి’ అని 65 ఏళ్ల సమరాంచ్‌ పేర్కొన్నారు. 

లింగమార్పిడితో అమ్మాయిలుగా మారిన ట్రాన్స్‌జెండర్లతో నిజమైన మహిళా అథ్లెట్ల ప్రయోజనాలకు నష్టం కలుగకుండా ఐఓసీ నిర్ణయం ఉండాలన్నారు. గతేడాది రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ట్రాన్స్‌జెండర్లను అనుమతించబోమనే ప్రెసిడెన్షియల్‌ రూల్‌ కూడా ఉంది. ఇప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లను మహిళల కేటగిరీలో పోటీపడకుండా నిక్కచ్చిగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. 

ఎందుకంటే 2028లో లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ట్రంప్‌ ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమరాంచ్‌ కూడా ఐఓసీ ఉన్నతస్థాయి మండలి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్‌కు చెందిన ఈ సీనియర్‌ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవీకాలం ముగిసిన ప్రస్తుత అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ వారసుడి ఎన్నిక కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. 

ఈ నెల 20న ఐఓసీ ఎన్నికలు జరుగనున్నాయి. సమరాంచ్‌తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్‌ చీఫ్‌ సెబాస్టియన్‌ కో, పలు ఒలింపిక్స్‌లలో స్విమ్మింగ్‌ చాంపియన్‌ క్రిస్టీ కొవెంట్రీ, అంతర్జాతీయ సైక్లింగ్‌ చీఫ్‌ డేవిడ్‌ లాపర్టియెంట్, జోర్డాన్‌ చక్రవర్తి ఫైజల్‌ అల్‌ హుస్సేన్, ప్రపంచ జిమ్నాస్టిక్స్‌ హెడ్‌ మోరినరి వతనబె, కొత్తగా ఐఓసీలోకి వచ్చిన మల్టీ మిలియనీర్‌ జోహన్‌ ఎలియస్చ్‌ (ప్రపంచ స్కీయింగ్‌ చీఫ్‌)లు ఐఓసీ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌లో లింగమార్పిడి చేసుకున్న న్యూజిలాండ్‌ వెయిట్‌లిఫ్టర్‌ లారెల్‌ హబర్డ్‌ మహిళల ప్లస్‌ 87 కేజీ విభాగంలో పోటీపడింది. అయితే ఆమె చివరిదైన 14వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ తొలి ట్రాన్స్‌జెండర్‌ అథ్లెట్‌గా ఆమె గుర్తింపు పొందింది.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)