Breaking News

2028 ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ఐఓసీ

Published on Tue, 03/18/2025 - 10:51

కోస్టా నవరినో (గ్రీస్‌): లాస్‌ ఏంజెలిస్‌ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ పోటీలు నిర్వహించే అంశంపై సందిగ్ధత వీడింది. ఆటలో సమగ్రత, నిర్ణయాల్లో స్పష్టత లేదనే కారణంగా 2022లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సమావేశంలో ఒలింపిక్స్‌ ప్రాథమిక క్రీడాంశాల జాబితాలో బాక్సింగ్‌ను చేర్చలేదు. 

కాగా... మంగళవారం నుంచి ఐఓసీ 144వ సెషన్‌ ప్రారంభం కానుండగా... దీనికి ముందు సోమవారం కార్యనిర్వాహక బోర్డు ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ క్రీడను కొనసాగించేందుకు పచ్చజెండా ఊపింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఐబీఏ)ను పక్కన పెట్టి... ప్రపంచ బాక్సింగ్‌ సంఘానికి తాత్కాలిక గుర్తింపు నిచ్చిన తర్వాత ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది.

నేటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఐఓసీ సెషన్‌లో థామస్‌ బాచ్‌ స్థానంలో కొత్త అధ్యక్షుడిని కూడా ఎన్నుకోనున్నారు. ఇదే సెషన్‌లో 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ను చేర్చే అంశానికి ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోదం తెలపనుంది. 

‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్‌ సంఘానికి తాత్కాలిక గుర్తింపు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. దీన్ని ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ఆమోదానికి పంపుతాం. ప్రపంచ బాక్సింగ్‌ సంఘం గుర్తించిన జాతీయ సమాఖ్యలకు చెందిన బాక్సర్లు నిరభ్యంతరంగా ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు.

పాలనా సమస్యలపై సుదీర్ఘ వివాదంతో పాటు బౌట్‌ల సమగ్రతకు సంబంధించిన ఆందోళనల కారణంగా ఐబీఏ గుర్తింపును రద్దు చేశాం. అనంతరం గత రెండు ఒలింపిక్స్‌ (2020 టోక్యో, 2024 పారిస్‌) క్రీడల్లో బాక్సింగ్‌ పోటీలను తిరిగి పర్యవేక్షించాం. 

వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే బాక్సింగ్‌కు ఒలింపిక్స్‌లో అవకాశం కల్పించాం’ అని థామస్‌ బాచ్‌ వెల్లడించారు. ప్రపంచ బాక్సింగ్‌ సంఘం అధ్యక్షడు బోరిస్‌  ఐఓసీ నిర్ణయాన్ని స్వాగతించారు. దీంతో క్రీడకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.   

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)