Breaking News

ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్‌ క్రికెట్‌ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు!

Published on Sun, 08/06/2023 - 08:38

పీసీబీ చైర్‌పర్సన్‌గా జాకా అష్రాఫ్ నియమితులైన తర్వాత పాక్‌ క్రికెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మిస్బా ఉల్‌ హక్‌, ఇంజమామ్ ఉల్‌ హక్‌, మహ్మద్ హఫీజ్‌లతో కూడిన క్రికెట్ టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసిన అష్రాష్‌.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసు​కోనున్నట్లు తెలుస్తోంది.

ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఇంజమామ్-ఉల్-హక్‌కు మరోసారి పాకిస్తాన్‌ ఛీప్‌ సెలక్టర్‌ బాధ్యతలు అప్పజెప్పాలని అష్రాఫ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో 2016 నుంచి 2019 వరకు పాకిస్తాన్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌గా ఇంజామామ్‌  పనిచేశాడు.

ఈ మెరకు త్వరలో జరగనున్న క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసు​కోనున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అదే విధంగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ ఛీప్‌గా  నజామ్ సేథీ ఉన్న సమయంలో ఆ జట్టు కోచ్‌లు మిక్కీ ఆర్థర్,బ్రాడ్‌బర్న్, డేటా ఎనలిస్ట్‌ హసన్‌ చీమాకు కూడా పాకిస్తాన్‌ సెలక్షన్‌ కమిటీలో భాగమయ్యారు. ఇప్పుడు వారిని సెలక్షన్‌ కమిటీలో కొనసాగించాలా లేదా అన్నది కూడా క్రికెట్ టెక్నికల్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సెలక్షన్‌ ప్యానల్‌లో హెడ్‌ కోచ్‌ ఉండాలా లేదా అన్నది పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంతో కూడా ఈ టెక్నికల్‌ కమిటీ చర్చించనుంది. ఆసియాకప్‌కు జట్టు ఎంపిక ముందు కొత్త సెలక్షన్‌ ప్యానల్‌ను ఖారారు చేసే అవకాశం ఉంది.
చదవండి: IND vs WI: టీమిండియాతో వన్డే సిరీస్‌.. ఆస్ట్రేలియాకు బిగ్‌షాక్‌! కెప్టెన్‌ దూరం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)