Breaking News

'ఐపీఎల్‌ను బాయ్‌క‌ట్ చేయండి'.. భార‌త్‌పై అక్కసు వెల్లగక్కిన ఇంజమామ్

Published on Sun, 03/02/2025 - 13:39

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్య‌మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే 29 ఏళ్ల త‌ర్వాత త‌మ దేశంలో జ‌రుగుతున్న ఐసీసీ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్, భారత్‌ చేతిలో వరుస ఓటములను చవిచూసిన పాకిస్తాన్ జట్టు.. ఈ మెగా టోర్నీ గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది.

దీంతో పాక్‌​ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు టీమిండియా మాత్రం వరుస విజయాలతో తమ సెమీస్ బెర్త్‌ను బెర్త్‌ను ఖారారు చేసుకుంది. కాగా పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో భారత్‌ మాత్రం తమ మ్యాచ్‌లను దుబాయ్‌ వేదికగా ఆడుతోంది.

భద్రత కారణాల రీత్యా తమ జట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. దీంతో ఐసీసీ ఈ ఈవెంట్‌ను హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భార‌త జ‌ట్టుపై పాకిస్తాన్ క్రికెట్ దిగ్గ‌జం ఇంజమామ్ ఉల్ హక్ మ‌రోసారి త‌న అక్క‌సును వెల్లగక్కాడు. బీసీసీఐకి వ్యతిరేకంగా  అన్ని క్రికెట్ బోర్డులు ఏకం కావాలని ఇంజమామ్ విషం చిమ్మాడు. 

"ఛాంపియన్స్ ట్రోఫీ విషయం పక్కన పెట్టండి. ప్రపంచంలోని టాప్ ప్లేయర్లందరూ ఐపీఎల్‌లో పాల్గోంటారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఇతర ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల్లో పాల్గోనరు. అందుకు వారి క్రికెట్ బోర్డు అంగీకరించదు. కాబట్టి ఇతర క్రికెట్ బోర్డులు కూడా తమ ఆటగాళ్లను ఐపీఎల్‌ ఆడేందుకు ఎన్‌వోసీ జారీ చేయకూడదు. ఈ విషయంపై అన్ని క్రికెట్ బోర్డులు ఒకే తాటిపై రావాలని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంజమామ్ పేర్కొన్నాడు.

అయితే ఒక్క పాకిస్తాన్ మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఉంది. ఐపీఎల్ ప్రారంభంలో పాకిస్థాన్ ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనేవారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్(2008) లో చాలా మంది పాక్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడారు.

అయితే ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా నిషేధిం‍చారు. కాగా బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్లను విదేశీ లీగ్‌లలో ఆడేందకు అనుమతించదు. ఒక ఇండియన్ క్రికెటర్‌ ఓవర్సీస్ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాలంటే ఐపీఎల్‌తో సహా భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలి.
చదవండి: CT 2025 IND Vs NZ: కివీస్‌తో మ్యాచ్‌.. స్టార్‌ ప్లేయర్లకు రెస్ట్‌! విధ్వంసకర వీరుడి ఎం‍ట్రీ?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)